తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కౌంటింగ్ ప్రారంభమైంది.  కౌంటింగ్ లో భాగంగా పలు చోట్ల అపశ్రుతులు చోటుచేసుకుంటున్నాయి.

 భూపాలపల్లిలో బ్యాలెట్ పత్రాలకు చెదలు పట్టి పూర్తిగా పాడైపోగా నిజామాబాద్‌ కౌంటింగ్ కేంద్రంలో కనీస వసతులు కరువై ఉద్యోగులు మూర్చబోయారు. హృదయ పాఠశాల కౌంటింగ్‌ కేంద్రంలో కనీస వసతులు కరువయ్యాయి. తాగునీరు లేక సిబ్బంది అవస్థలు పడుతున్నారు. ముగ్గురు ఉద్యోగులు మూర్చబోయారు. దీంతో కౌంటింగ్‌ ఏజెంట్లు, అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ కౌంటింగ్ నిలిచిపోయింది.