ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు రేపే పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో స్థిరపడిన ఏపీ వాసులంతా.. సొంతూళ్లకు పయనమయ్యారు.

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు రేపే పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో స్థిరపడిన ఏపీ వాసులంతా.. సొంతూళ్లకు పయనమయ్యారు. ఏపీ వైపు వెళ్లే రహదారులపై ఎక్కడ చూసినా కూడా వాహనాలే కనిపిస్తున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఎన్నికల నేపథ్యంలో ఏపీవాసులు తమ సొంతూళ్లకు పయనమవుతుండడంతో రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా దగ్గర ట్రాఫిక్ జామైంది. కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. 

దీంతో టోల్ ప్లాజా వద్ద కనిపించనంత దూరం వాహనాలు కనిపిస్తుండడంతో రహదారులు ఎక్కడ చూసినా కూడా వాహనాలతో బారులు తీరి దర్శనిమిస్తున్నాయి.