Asianet News TeluguAsianet News Telugu

సిఎం కేసిఆర్ కు కొత్త చిక్కు

సీన్ మారపోతుందా?
Election commission plan of one constituency norm to put break to kcr plans of double contest

జాతీయ రాజకీయాల్లో ప్రవేశించేందుకు తెలంగాణ సిఎం కేసిఆర్ ప్రయత్నాలు షురూ చేశారు. అందుకోసమే రానున్న ఎన్నికల్లో ఒక అసెంబ్లీ స్థానానికి, అలాగే ఒక పార్లమెంటు సీటుకు పోటీ చేస్తారని టిఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. కానీ ఇంతలోనే కేసిఆర్ కు కొత్త చిక్కు వచ్చి పడింది. కేంద్ర ఎన్నికల సంఘం కేసిఆర్ ఆలోచనా విధానానికి అడ్డుకట్ట వేసేలా కనబడుతున్నది.

తెలంగాణ సిఎం కేసిఆర్ ఆలోచనలకు కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్ వేసేలా ఉందా? కేసిఆర్ సాహసాలకు రానున్న రోజుల్లో అడ్డుకట్ట పడనుందా? 2019లో కేసిఆర్ వ్యూహం మార్చక తప్పని పరిస్థితి రానుందా? అంటే అవుననే అనిపిస్తోంది.

కేసిఆర్ రానున్న 2019 ఎన్నికల్లో రెండుచోట్ల పోటీ చేస్తారని ఇప్పటికే పార్టీలో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సిట్టింగ్ గా ఉన్న గజ్వేల్ లో అసెంబ్లీకి పోటీ చేస్తూనే మరోవైపు పార్లమెంటుకు నల్లగొండ నుంచి కేసిఆర్ పోటీ చేస్తారని టాక్ వినబడుతున్నది.

కానీ కేసిఆర్ ఆ రకమైన పోటీకి దిగేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేయనుందన్నవార్త ఒకటి వెలువడింది. ఒక వ్యక్తి ఒకేసారి లోక్ సభ సీటుకు, అసెంబ్లీ సీటుకు పోటీ చేయడాన్ని ఇకపై నిషేధించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అలాగే ఒకేసారి రెండు లోక్ సభ సీట్లకు కానీ, రెండు అసెంబ్లీ సీట్లకు కూడా పోటీని నివారించేందుకు ఈసి చర్యలు తీసుకోవచ్చని తెలుస్తోంది.

 ఈ విషయమై ఒక అభ్యర్థి ఒకే స్థానంలో పోటీ చేయాలన్న నిబంధన తీసుకురావాలంటూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఒక్కో అభ్యర్థి ఒక్క స్థానం కోసం మాత్రమే పోటీచేయాలన్న ప్రతిపాదనలకు మద్దతు ఇస్తున్నట్టు సుప్రీంకోర్టుకు భారత ఎన్నికల సంఘం నివేదించింది.

ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక అభ్యర్థి అటు ఎంపీ స్థానంతో పాటు ఇటు ఎమ్మెల్యే స్థానానికి కూడా పోటీ చేసే అవకాశం ఉంది. ఒక స్థానం కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయకుండా పరిమితం చేయాలంటూ దాఖలైన పిల్ కు సమాధానంగా ఈసీ ఈ మేరకు వెల్లడించింది. ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు ఓ నియోజక వర్గాన్ని వదిలి మరో స్థానానికి వెళ్లడం ఓటర్లకు అన్యాయం చేయడమేనని ఈసీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. దాంతోపాటు మరోసారి ఉప ఎన్నిక జరపడం కూడా ప్రజాధనం రెట్టింపుగా ఖర్చు చేయాల్సివస్తోందని ఈసి చెబుతున్నది.

సో మొత్తానికి ఈ కేసులో సుప్రీంకోర్టు ఏరకమైన తీర్పు చెబుతుందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే ఈ సమస్య ఒక్క కేసిఆర్ కే కాదు.. రెండుచోట్ల పోటీ చేయాలనుకున్న లీడర్లకు టెన్షన్ గానే ఉంటుందని చెప్పక తప్పదు. అటువంటి పరిస్థితే వస్తే కేసిఆర్ నల్లగొండలోనే పోటీ చేసి గజ్వెల్ లో పోటీ నుంచి తప్పుకుంటారా లేదంటే. సిద్ధిపేట పార్లమెంటు కానీ, ఇంకేదైనా సీటులో పోటీ చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios