Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ బీజేపీకి ఈసీ షాక్.. సాలు దొర - సెలవు దొర ప్రచారంపై అభ్యంతరం..

తెలంగాణ బీజేపీకి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. బీజేపీ చేపట్టిన ‘‘సాలు దొర - సెలవు దొర’’ ప్రచారంపై ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది.

election commission on bjp Salu dora selavu dora campaign
Author
First Published Aug 11, 2022, 3:06 PM IST

తెలంగాణ బీజేపీకి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. బీజేపీ చేపట్టిన ‘‘సాలు దొర - సెలవు దొర’’ ప్రచారంపై ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతున్న సంగత తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేస్తుంది. కేసీఆర్‌కు వ్యతిరేకంగా ‘‘సాలు దొర - సెలవు దొర’’ ప్రచారానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ బీజేపీ కార్యాలయం వద్ద సాలు దొర- సెలవు దొర అంటూ డిజటల్ బోర్డు కూడా ఏర్పాటు చేసింది. ఈ పేరు మీద సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది. 

అయితే ‘‘సాలు దొర - సెలవు దొర’’ప్రచారానికి అనుమతి  కోరుతూ బీజేపీ నేతల ఎన్నికల సంఘాన్ని సంప్రందించింది. అయితే దీనిని పరిశీలించిన ఎన్నికల సంఘం.. బీజేపీ చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. అంతేకాకుండా సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ప్రచారాన్ని నిలిపివేయాలని బీజేపీని కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశించింది. సీఎం బొమ్మతో బీజేపీ పోస్టర్లు ముద్రించేందుకు అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలిపింది. రాజకీయ పార్టీలకు చెందిన నేతలను కించపరిచేవిధంగా పోస్టర్లు, ఫోటోలు, రాతలు ఉండకూడదని పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios