సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కి ఎన్నికల  కమిషన్ షాక్ ఇచ్చింది. ఆయన ఎన్నికల ప్రచారానికి ఎన్నికల కమిషన్ అడ్డుకట్ట వేసింది. తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేయడానికి బాలకృష్ణ కు అనుమతి లేదని తేల్చి చెప్పింది.

ఇంతకీ మ్యాటరేంటంటే.. తెలంగాణలో మహాకూటమికి మద్దతుగా గత నాలుగైదు రోజులుగా బాలకృష్ణ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. షెడ్యూల్ ప్రకారం ఆయన ప్రచారం డిసెంబర్ 4వ తేదీతో ముగిసింది. అయితే.. ఆయన తన ప్రచారాన్ని ఆయన డిసెంబర్ 5వ తేదీన కూడా కొనసాగించాలని అనుకున్నారు. దానిని అనుమతి కావాలని ఎన్నికల కమిషన్ కోరారు.

అయితే.. ప్రచారం చేయాలనుకున్న వారు.. 48గంటల ముందే అనుమతి తీసుకోవాల్సి ఉంది. అలా చేయకపోవడం వల్ల ప్రచారానికి అనుమతి ఇవ్వలేమని ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పింది. ఇదిలా ఉండగా.. తెలంగాణ ఎన్నికల ప్రచారానికి ఈ రోజు ఆఖరి తేదీ అన్న సంగతి తెలిసిందే. 

 

మరిన్ని వార్తలు

టూ మచ్ ఎంటర్టైన్ మెంట్: బాలయ్యను ట్రోల్ చేసిన కేటీఆర్

సారే జహాసే..అచ్చా.. తప్పులో కాలేసిన బాలయ్య (వీడియో)