తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా నందమూరి బాలకృష్ణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై సినిమా డైలాగులతో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. అయితే బాలయ్య సినిమాలో మాదిరిగా డైలాగులు పేల్చే క్రమంలో తడబడుతూ నవ్వులపాలైన విషయం తెలిసిందే. అలాగే తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందీలో సారే జహాసే అచ్చా...గేయాన్ని పాడబోయి తడబడ్డాయి. దీంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆ వీడియో తిరిగి తిరిగి మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన కూడా స్పందించారు. 

ఓ నెటిజన్ ప్రముఖ టీవి ఛానల్లో వచ్చిన బాలయ్య వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. దీనిపై స్పందించిన కేటీఆర్ టూ మచ్ ఎంటర్టైన్ వీడియో అంటూ ట్వీట్ చేశారు.ఇలా కేటీఆర్ స్పందనతో బాలయ్య వీడియో మరింత వైరల్ గా మారింది. 

మరిన్ని వార్తలు

సారే జహాసే..అచ్చా.. తప్పులో కాలేసిన బాలయ్య (వీడియో)