Asianet News TeluguAsianet News Telugu

స్పీడు పెంచిన కేసీఆర్, ఇకపై రోజుకు నాలుగు సభలు .. మొత్తం 54 చోట్ల ప్రచారం, షెడ్యూల్ ఇదే

బీఆర్ఎస్‌ను మరోసారి అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహా ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. ఇకపై రోజుకు 4 చోట్ల జరిగే సభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ నెల 13 నుంచి 28 వరకు మొత్తం 54 సభల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. 

election campaign schedule of telangana cm kcr ksp
Author
First Published Nov 4, 2023, 9:48 PM IST

బీఆర్ఎస్‌ను మరోసారి అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహా ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. దీనితో పాటు అభ్యర్ధుల తరపున ఆయన సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే రోజుకు మూడు చోట్ల ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటున్నారు గులాబీ దళపతి. అయితే ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ వుండటంతో ఆయన వేగం పెంచారు. ఇకపై రోజుకు 4 చోట్ల జరిగే సభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ నెల 13 నుంచి 28 వరకు మొత్తం 54 సభల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఇప్పటి వరకు 30 నియోజకవర్గాల్లో కేసీఆర్ సభల్లో పాల్గొనగా.. ఈ నెల 9 వరకు మరో 9 సభల్లో సీఎం ప్రచారం నిర్వహిస్తారు. నవంబర్ 9న ఆయన గజ్వేల్, కామారెడ్డిలలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. 

కేసీఆర్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ :

నవంబర్ 13 : దమ్మపేట, బూర్గంపాడు, నర్సంపేట్‌
నవంబర్ 14 : పాలకుర్తి, హాలియా, ఇబ్రహీంపట్నం
నవంబర్ 15 : బోధన్‌, నిజామాబాద్‌ అర్బన్‌, ఎల్లారెడ్డి, మెదక్‌
నవంబర్ 16 :  ఆదిలాబాద్‌, బోథ్‌, నిజామాబాద్‌ రూరల్‌, నర్సాపూర్‌
నవంబర్ 17 : కరీంనగర్‌, చొప్పదండి, హుజూరాబాద్‌, పరకాల
నవంబర్ 18 :  చేర్యాల
నవంబర్ 19 : అలంపూర్‌, కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి
నవంబర్ 20 : మానకొండూరు, స్టేషన్‌ ఘన్‌పూర్‌, నకిరేకల్‌, నల్గొండ
నవంబర్ 21 : మధిర, వైరా, డోర్నకల్‌, సూర్యాపేట
నవంబర్ 22 :  తాండూర్‌, కొడంగల్‌, మహబూబ్‌నగర్‌, పరిగి
నవంబర్ 23 :  మహేశ్వరం, వికారాబాద్‌, జహీరాబాద్‌, పటాన్‌చెరు
నవంబర్ 24 : మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లి
నవంబర్ 25 : హైదరాబాద్‌
నవంబర్ 26 : ఖానాపూర్‌, జగిత్యాల, వేములవాడ, దుబ్బాక
నవంబర్ 27 :  షాద్‌నగర్‌, చేవెళ్ల, అందోల్‌, సంగారెడ్డి
నవంబర్ 28 : వరంగల్‌ ఈస్ట్‌, వరంగ్ వెస్ట్‌, గజ్వేల్‌

Follow Us:
Download App:
  • android
  • ios