మెదక్ : ఏడుపాయల ఆలయ ఈవో కు కరోనా పాజిటివ్ సోకింది. దీంతో గత వారం జరిగిన జాతరలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులు, ఆలయ సిబ్బందికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కరోనా పరీక్షలు చేస్తున్నారు. కరోనా సోకిన నేపథ్యంలో వారం రోజుల పాటు ఆలయం మూసివేస్తున్నట్లు తెలిపిన అధికారులు ప్రకటించారు.

దేవాలయ సిబ్బందికి కరోనా వ్యాధి వచ్చినందున భక్తుల శ్రేయస్సు దృష్టిలో ఉంచుకుని మార్చి 19 నుంచి 25 వ తేదీ వరకు దేవాలయ దర్శనాలను నిలిపివేయడం జరిగింది. కావును భక్తులు సహకరించగలరని మనవి అంటూ .. తెలంగాణ దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆలయంలో బ్యానర్లు కూడా కట్టింది. 

తెలంగాణ లో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. స్కూలు, గురుకుల పాఠశాలల్లో ఇప్పటికే అనేక కేసులు బయటపడ్డాయి. ఇప్పుడు తాజాగా ఏడుపాయల గుడిలో పాజిటివ్ కేసులు రావడంతో తీవ్ర ఆందోళన నెలకొంది.