రేపటి నుండి స్కూల్స్ రీ ఓపెన్: తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

రేపటి నుండి తెలంగాణలో స్కూల్స్ పున: ప్రారంభించనున్నట్టుగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. సెలవులు పొడిగించే ఆలోచన లేదన్నారు. ఈ ఏడాది నుండి ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టనున్నట్టుగా మంత్రి వివరించారు.

Education Minister Sabitha Indra Reddy Says No Extension in Summer Vacation for Telangana Schools

హైదరాబాద్: రేపటినుండి రాష్ట్రంలో Schools పున: ప్రారంభించనున్నట్టుగా తెలంగాణ విద్యా శాఖ మంత్రి Sabitha Indra Reddy చెప్పారు. 

ఆదివారం నాడు మంత్రి సబితా ఇంద్రారెడ్డి Hyderabad లో   మీడియాతో మాట్లాడారు. ఈ విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టనున్నట్టుగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. holidays పొడిగించే ఆలోచన లేదని మంత్రి తెలిపారు.  మన ఊరు మన బడి కార్యక్రమానికి కేంద్రం నుండి ఒక్క పైసా నిధులు లేవన్నారు.ఈ విషయమై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay సంజయ్ చేసిన  ప్రకటనను ఆమె తప్పు బట్టారు.నిస్సిగ్గుగా సంజయ్ అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. రూ. 2700 కోట్లు ఇచ్చినట్టుగా సంజయ్ చేసిన ప్రకటనను ఆమె తప్పుబట్టారు. రూ. 2700 కోట్లను వెంటనే ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. 

రాష్ట్రంలోని  950 గురుకుల పాఠశాలల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన విద్యార్ధులు 4 లక్షల మంది విద్యను అభ్యసిస్తున్నారని ఆమె గుర్తు చేశారు.8 ఏళ్లలో 1050 గరుకుల కాలేజీలు, 53 డిగ్రీ కాలేజీలతో పాటు రెండు పీజీ కాలేజీలను కూడా ఏర్పాటు చేశామన్నారు. రెండు ప్రభుత్వ లా కాలేజీలను ఏర్పాటు చేసినట్టుగా మంత్రి గుర్తు చేశారు.Telangana లో  ఒకటి తర్వాత ఒకటి ఎలా మార్పు చేస్తున్నామో చూడాలని ఆమె బీజేపీ నేతలకు సూచించారు. బాధ్యతగా బీజేపీ నేతలు మాట్లాడాలని మంత్రి కోరారు. రెండు రోజుల క్రితం TET పరీక్షను వాయిదా వేయాలని కోరారని డిమాండ్ చేశారన్నారు. మరో వైపు రాష్ట్రంలో 20 వేల teacher పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారని విపక్షాల తీరును ఆమె తప్పు బట్టారు. టెట్ పరీక్ష నిర్వహించకుండా ఉపాధ్యాయ పోస్టులను ఎలా భర్తీ చేస్తారని ఆమె ప్రశ్నించారు. ద్వంద్వ నీతిని విడనాడాలని ఆమె విపక్షాలను కోరారు. 

నవోదయ స్కూళ్లను తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఏర్పాటు చేయలేదో  కేంద్రాన్ని అదగాలని ామె బీజేపీనేతలను  ప్రశ్నించారు.ఐఐఐటీ, ఐఐటీలు రాష్ట్రానికి ఎందుకు ఇవ్వలేకపోయారో కేంద్రాన్ని బీజేపీ నేతలు నిలదీయాలన మంత్రి సబితా ఇంద్రారెడ్డి  సూచించారు.

ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులను నియంత్రించాలనే ఉద్దేశ్యంతో తమ ప్రఁభుత్వం తిరుపతి రావు కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. కరోనా సమయంలో ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు పెంచకుండా చర్యలు తీసుకున్నామన్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios