ఆ విద్యాసంస్థపై కడియం ఆగ్రహం

ఆ విద్యాసంస్థపై కడియం ఆగ్రహం


స్కూల్ కి షూస్ వేసుకురాలేదని ఓ విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఓ కార్పోరేట్ పాఠశాల పై కేసు నమోదైంది. విద్యార్థి పట్ల అమానవీయంగా ప్రవర్తించిన స్కూల్ యాజమాన్యంపై ఏకంగా విద్యాశాఖ మంత్రి సీరియస్ కావడంతో ఈ వివాదం ముదిరింది. మంత్రి ఆదేశాలతో పోలీసులు, విద్యాశాఖ కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఇంతకు అసలు విద్యార్థి చేసిన తప్పేంటి, అందుకు అతడికి ఏ శిక్షవిధించారో తెలియాలంటే క్రింది స్టోరి చదవండి.  
వివరాల్లోకి వెళితే మదీనగూడ చెందిన చేతన్ చౌదరి అనే విద్యార్థి మొయినాబాద్ అజీజ్ నగర్ లోని శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్లో 7 వ తరగతి చదువుతున్నాడు. అయితే అతడి కాలికి గాయం కావడంతో షూస్ వేసుకోకుండా స్కూల్ కి వెళ్లాడు. దీంతో ఆ తరగతి ఉపాద్యాయుడు విద్యార్థికి ఆ రోజంతా లంయ్ కూడా తిననీయకుండా ఓ గదిలో భందించారు.  ఈ విషయాన్ని విద్యార్థి ఇంటికివెళ్లాక తల్లి దండ్రులకు తెలపడంతో వారు పాఠశాల యాజమాన్యానికి తెలిపారు. అయినా యాజమాన్యం స్పందించకపోవడంతో విద్యార్థి తల్లి మొయినాబాద్ పోలీసులకు పిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

అయితే ఇలా చిన్న తప్పుకు విద్యార్థికి లంచ్ పెట్టకుండా, గదిలో నిర్బంధించిన వ్యవహారం పై మంత్రి కడియం ఆగ్రహించారు. దీనిపై విచారణ జరిపి వెంటనే రిపోర్ట్ ఇవ్వాలని విద్యాశాఖను ఆదేశించారు కడియం. ఇలా పిల్లలను అనవసరంగా  వేదింపులకు గురి చేస్తే సహించేది లేదని, విచారణ నివేదికలో వచ్చిన నిజానిజాల పై దోషులపై కఠిన చర్యలు  తీసుకుంటిమని విద్యాశాఖ మంత్రి కడియం తెలిపారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos