హైదరాబాద్‌లో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన స్కూల్స్‌పై కొరడా ఝళిపిస్తున్నారు విద్యాశాఖ అధికారులు. విజయనగర్ కాలనీలో మధులత స్కూల్‌‌కి నోటీసులు ఇచ్చారు

హైదరాబాద్‌లో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన స్కూల్స్‌పై కొరడా ఝళిపిస్తున్నారు విద్యాశాఖ అధికారులు. విజయనగర్ కాలనీలో మధులత స్కూల్‌‌కి నోటీసులు ఇచ్చారు.

పాఠశాల గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో 24 గంటల్లో సమాధానం చెప్పాలని ఆదేశించారు. కోవిడ్ నిబంధనలు పాటించకుండా ప్రైమరీ సెక్షన్‌ను సైతం నిర్వహిస్తోంది స్కూల్ యాజమాన్యం.

9,10 తరగతులు మాత్రమే నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. పాఠశాల ప్రాంగణమంతా కూడా అపరిశుభ్రంగా వుంది. అందులోనే నివాసం వుంటున్నారు బ్యాచిలర్స్. 

కాగా, తెలంగాణలో కోవిడ్‌ కారణంగా పది నెలల పాటు మూతపడిన విద్యాసంస్థలు ఫిబ్రవరి 1 నుంచి తెరుచుకున్న సంగతి తెలిసిందే. గత సోమవారం నుంచి 9 నుంచి అపై తరగతులకు అనుమతించింది ప్రభుత్వం.

దీంతో పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్‌తో పాటు వృత్తి విద్యా కళాశాలలన్నీ తెరుచుకోన్నాయి. రాష్ట్రంలో మొత్తం 30 లక్షలకుపైగా విద్యార్థులు హాజరయ్యారని సమాచారం.

ఇప్పటి వరకు 70 శాతానికిపైగా తల్లిదండ్రులు సమ్మతి పత్రాలు సమర్పించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే విద్యాసంస్థల వద్ద శానిటైజర్లు, మాస్కులు తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.