హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని డీఏవీ స్కూల్ తెలంగాణ విద్యాశాఖ అనుమతిని పునరుద్దరించింది. ఈ విద్యా సంవత్సరానికి తాత్కాలిక అనుమతిచ్చింది.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని డీఏవీ స్కూల్ తెలంగాణ విద్యాశాఖ అనుమతిని పునరుద్దరించింది. ఈ విద్యా సంవత్సరానికి తాత్కాలిక అనుమతిచ్చింది. విద్యాశాఖ అనుమతి నేపథ్యంలో డీఏవీ యాజమాన్యం.. ఎల్లుండి పాఠశాలను పున:ప్రారంభించనుంది. డీఏవీ స్కూల్‌లో చిన్నారిపై లైంగిక దాడి ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విద్యాశాఖ డీఏవీ స్కూల్ గుర్తింపును రద్దు చేసింది. అయితే విద్యార్థుల భవిష్యత్తు కోసం పాఠశాల అనుమతిని కొనసాగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యశాఖకు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈ విద్యా సంవత్సరానికి పాఠశాల నిర్వహించడానికి విద్యాశాఖ అనుమతించింది. అదే సమయంలో విద్యాశాఖ సూచించిన నిబంధనలను అమలు చేయాలని ఆదేశించింది.
కాగా... బంజారాహిల్స్‌లోని డీఏవీ స్కూల్‌లో ఎల్‌కేజీ చదువుతున్న చిన్నారిపై అదే పాఠశాలప్రిన్సిపాల్ మాధవి కారు డ్రైవర్ రజనీకుమార్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రిన్సిపాల్ గదికి పక్కనే ఈ దారుణం జరిగినా ప్రిన్సిపాల్ మాధవి నిరోధించకపోవడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన డ్రైవర్‌ను చితకబాది పోలీసులకు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రజనీ కుమార్‌తో పాటు ప్రిన్సిపాల్ ఎస్ మాధవీపైనా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వీరిద్దరికి మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు.
