Asianet News TeluguAsianet News Telugu

మరోసారి విచారణకు రావాలని ఈడీ కోరలేదు: మూడు గంటలకు పైగా గీతారెడ్డి విచారణ

నేషనల్ హెరాల్డ్ కేసులో  మాజీ మంత్రి గీతారెడ్దిని ఈడీ అధికారులు మూడు గంటల పాటు విచారించారు. గీతారెడ్డితో పాటు గాలి అనిల్ కుమార్ లు  కూడా ఇవాళ విచారణకు హాజరయ్యారు. 

ED Questions Former Minister Geetha Reddy In National Herald Case
Author
First Published Oct 6, 2022, 2:47 PM IST

హైదరాబాద్: నేషనల్ హెరాల్డ్ కేసులో తన విచారణ ముగిసిందని మాజీ మంత్రి గీతారెడ్డి తెలిపారు. నేషనల్  హెరాల్డ్ కేసులో ఈడీ విచారణకు మాజీ మంత్రి గీతారెడ్డి  గురువారం నాడు హాజరయ్యారు. గీతారెడ్డితో  పాటు ఆ పార్టీనేత గాలి అనిల్ కుమార్ ను కూడా ఈడీ అధికారులు విచారించారు. విచారణముగిసిన తర్వాత న్యూఢిల్లీలో ఆమె  మీడియాతో మాట్లాడారు. మరోసారి విచారణకు రావాలని కోరలేదన్నారు.

 ఈ కేసులో విచారణకు హాజరుకావాలని  ఈ ఏడాది సెప్టెంబర్ 23న కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేశారు. మాజీ మంత్రులు గీతారెడ్డి, సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఆ పార్టీ నేత గాలి అనిల్ కుమార్ లకు ఈడీ అధికారులునోటీసులు జారీ చేశారు. ఇప్పటికే మాజీ మంత్రి షబ్బీర్ అలీ విచారణ ముగిసింది. ఇవాళ గీతారెడ్డి, గాలి అనిల్ కుమార్ లను ఈడీఅధికారులు విచారించారు.ఎల్లుండి మాజీ మంత్రి సుదర్శన్  రెడ్డిని ఈడీ అధికారులు విచారించనున్నారు.  మాజీ  ఎంపీ అంజన్ కుమార యాదవ్  అనారోగ్యంతో  ఆసుపత్రిలో ఉన్న నేపథ్యంలో ఈడీ విచారణకు హాజరుకావడంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 

ఇవాళ విచారణకు హాజరైన  గీతారెడ్డిని మూడు గంటలకు పైగా ఈడీ అధికారులు విచారించారు.  ఈడీ అధికారులు కోరిన సమాచారాన్ని గీతారెడ్డి, అనిల్ కుమార్ లు అందించారు.అనిల్కుమార్ ను ఐదు గంటలకు పైగా విచారించారు . విచారణ ముగిసిన తర్వాత మరోసారి రావాలని తనను  కోరలేదని గీతారెడ్డి  మీడియాకు చెప్పారు.  అయితే ఈడీ అధికారులు ఏ విషయాలపై ప్రశ్నించారనే విషయమై చెప్పేందుకు మాత్రం గీతారెడ్డి నిరాకరించారు.  

ఇదే కేసులో కర్ణాటకకు చెందిన  నేతలు డీకే శివకుమార్ ఆయన సోదరుడు డీకే సురేష్ లు రేపు ఈడీ విచారణకు  హాజరు కానున్నారు. నేషనల్ హెరాల్డ్  కేసులో   కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు  సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ అధికారులు విచారించారు. ఈ ఏడాది జూలై మాసంలోనే  సోనియాగాంధీ ఈడీ విచారణకు హాజరయ్యారు.  అనారోగ్య కారణాలతో ఈడీ విచారణకు  హాజరయ్యేందుకు సమయాన్ని కోరారు.

also read:నేషనల్ హెరాల్డ్ కేసు: ఈడీ విచారణకు హాజరైన మాజీ మంత్రి గీతారెడ్డి

కరోనా కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తడంతో  సోనియా గాంధీ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత  ఈడీ విచారణకు హాజరయ్యారు. రాహుల్ గాంధీ,సోనియాలను సుమారు 50 గంటలకు పైగా ఈడీ అధికారులు విచారించారు.బీజేపీ  ఎంపీ సుబ్రమణ్యం ఫిర్యాదు మేరకు ఈడీ అధికారులు నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ జరుపుతున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios