నేషనల్ హెరాల్డ్ కేసు: ఈడీ విచారణకు హాజరైన మాజీ మంత్రి గీతారెడ్డి
నేషనల్ హెరాల్డ్ కేసులో మాజీమంత్రి గీతారెడ్డి ఇవాళ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత గీతారెడ్డి గురువారం నాడు ఈడీ అధికారుల విచారణకు హజరయ్యారు. తెలంగాణకు చెందిన ఐదుగురు కాంగ్రెస్ నేతలకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
నోటీసులు అందుకున్న కాంగ్రెస్ నేతలు ఈడీ విచారణకు హాజరౌతున్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రికకు విరాళాలు ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఈడీ అధికారులు విచారిస్తున్నారు.విచారణకు హాజరు కావాలని గతంలోనే తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసులో ఇప్పటికే మాజీమంత్రి షబ్బీర్అలీని ఈడీఅధికారులు విచారించారు. ఎల్లుండి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించనున్నారు. ఇవాళ గీతా రెడ్డి విచారణకు హాజరయ్యారు.
ఈడీ విచారణకు హాజరు కావడానికి ముందుగానే ఆడిటర్లతో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ నేతలు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, గీతారెడ్డి,అంజన్ కుమార్ యాదవ్, గాలి అనిల్ కుమార్ లకు ఈడీ నోటీసులు జారీ చేసింది. వీరంతా గత నెల 30వ తేదీన ఢిల్లీకి వెళ్లారు కాంగ్రెస్ నేతలు. సెప్టెంబర్ 23వ తేదీనే కాంగ్రెస్ నేతలు ఈడీ అధికారులు నోటీసులు జారీచేశారు.
త్వరలోనే తెలంగాణ లో భాతర్ జోడో యాత్ర ప్రారంభం కానుంది. ఈ పాదయాత్రను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ తరుణంలోనే ఈడీ నోటీసులు జారీ చేయడంపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఈడీ విచారణపేరుతో తమ పార్టీకి చెందిన నేతలను వేధింపులకు గురి చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
also read:నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు: ఆడిటర్లతో భేటీకి ఢిల్లీకి
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియాగాంధీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీలను కూడ ఈడీ అధికారులు విచారించారు. వీరిని విచారించే సమయంలో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. ఈ ఏడాది జూలై మాసంలో సోనియాగాంధీని ఈడీ అధికారులు విచారించారు. అంతకు ముందే రాహుల్ గాంధీ ఈడీ విచారణకు హాజరయ్యారు. సోనియాగాంధీ,రాహుల్ గాంధీలను 50గంటలకు పైగా ఈడీ అధికారులు విచారించారు. బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామిఇచ్చిన ఫిర్యాదు మేరకు నేషనల్ హెరాల్డ్ కేసును ఈడీ అధికారులు విచారిస్తున్నారు.