హైదరాబాద్:హీరా గోల్డ్ సీఈఓ నౌహీరా షేక్‌ను ఈడీ తమ కస్టడీలోకి తీసుకొంది. ఈ నెల 15వ తేదీ నుండి  వారం రోజుల పాటు ఈడీ కస్టడీలో నౌహీరా ఉంటారు.బుధవారం నాడు నౌహీరాను ఈడీ తమ కస్టడీలోకి తీసుకొన్నారు.

హీరా గోల్డ్ గ్రూప్ సంస్థకు నౌహీరా షేక్ సీఈఓగా ఉన్నారు. ప్రజల నుండి సుమారు 3 వేలకు పైగా డిపాజిట్లను సేకరించారు. ఈ డిపాజిట్లను వ్యక్తిగత ఖాతాలను మళ్లించినట్టుగా పోలీసులు గుర్తించారు.

నౌహీరాతో పాటు బిజూ థామస్, మెలి థామస్‌లను కూడ అరెస్ట్ చేశారు. పీఎంఎల్ఏ  యాక్టు కింద కేసు  పెట్టినట్టుగా ఈడీ అధికారులు ప్రకటించారు. ఈడీ అధికారులు నౌహీరా షేక్‌ను బషీర్‌బాగ్‌లోని తమ కార్యాలయానికి తీసుకెళ్లారు. వారం రోజుల పాటు ఇక్కడే ఆమెను విచారించే అవకాశం ఉంది.