Asianet News TeluguAsianet News Telugu

బ్యాంకుల నుండి రూ. 1207 కోట్ల రుణాలు: వీఎంసీ డైరెక్టర్ హిమబిందు అరెస్ట్, మరో ఇద్దరి కోసం లుకౌట్ నోటీసు

నకిలీ పత్రాలతో బ్యాంకుల నుండి రూ.1207 కోట్లు రుణాలు తీసుకొని మోసం చేసిన కేసులో వీఎంసీ డైరెక్టర్ హిమబిందును  ఈడీ అధికారులు గురువారం నాడు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు డైరెక్టర్లు డైరెక్టర్లు  వెంకటరామారావు, వెంకటరమణల కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

ED arrests VMC PVT LTD director Himabindhu lns
Author
Hyderabad, First Published Aug 5, 2021, 3:49 PM IST


హైదరాబాద్:  నకిలీ పత్రాలతో బ్యాంకుల నుండి రుణాలు తీసుకొని మోసం చేశారని వీఎంసీ డైరెక్టర్ ఉప్పలపాటి హిమబిందును ఈడీ  అధికారులు గురువారం నాడు అరెస్ట్ చేశారు.ఈ విషయమై 2018లోనే సీబీఐ అధికారులు వీఎంసీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై కేసు నమోదు చేశారు. ఈ  ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. 

పంజాబ్ నేషనల్ బ్యాంకు నుండి రూ. 539 కోట్లు, ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంకు , కార్పొరేషన్ బ్యాంకుల నుండి రూ.1207 కోట్ల రుణాలను నకలీ పత్రాలను  చూపి రుణాలు పొందారని ఈ సంస్థ డైరెక్టర్లపై సీబీఐ కేసు నమోదు చేసింది. సీబీఐ విచారణకు ముగ్గురు డైరెక్టర్లు సహకరించలేదు. కంపెనీ డైరెక్టర్లుగా ఉన్న హిమబిందును ఇవాళ ఈడీ అరెస్ట్ చేసింది.

మరో ఇద్దరు డైరెక్టర్లు  వెంకటరామారావు, వెంకటరమణల కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు.2018 నుండి బీఎస్ఎన్ఎల్ నుండి రావాల్సిన బకాయిలు వస్తే చెల్లిస్తామన్న కంపెనీ సీబీఐకి తెలిపింది. బీఎస్ఎన్‌ఎల్ నుండి వీరికి రూ. 33 కోట్లు రావాల్సి ఉంది. అయితే రూ.262 కోట్లు రావాల్సి ఉందని తమను కంపెనీ డైరెక్టర్లు తప్పుదోవ పట్టించారని సీబీఐ ఆరోపిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios