Asianet News TeluguAsianet News Telugu

Huzurabad ByPoll: ఈసీ కొత్త గైడ్‌లైన్స్.. హుజురాబాద్‌లో కేసీఆర్ సభపై డైలామా, టీఆర్ఎస్ స్టెప్పేంటో..?

ఈ నెల 27న ఎల్కతుర్తి మండలంలో (elkathurthy) టీఆర్ఎస్ (trs) నిర్వహించనున్న సభపై డైలమా నెలకొంది. గులాబీ దళపతి, తెలంగాణ సీఎం కేసీఆర్ (cm kcr) స్వయంగా ఈ సభకు హాజరుకానున్నారు. అయితే కేంద్ర ఎన్నికల కమీషన్ జారీ చేసిన  కొత్త నిబంధనల్లో కేసీఆర్ సభపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

EC tightens campaigning rules after review of last 5 assembly polls effect on trs public meeting
Author
Hyderabad, First Published Oct 21, 2021, 7:20 PM IST

ఈ నెల 27న ఎల్కతుర్తి మండలంలో (elkathurthy) టీఆర్ఎస్ (trs) నిర్వహించనున్న సభపై డైలమా నెలకొంది. గులాబీ దళపతి, తెలంగాణ సీఎం కేసీఆర్ (cm kcr) స్వయంగా ఈ సభకు హాజరుకానున్నారు. అయితే కేంద్ర ఎన్నికల కమీషన్ జారీ చేసిన  కొత్త నిబంధనల్లో కేసీఆర్ సభపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పెంచికల్ పేటలో (penchikalpet) టీఆర్ఎస్ చేపట్టిన సభ హుజురాబాద్ (huzurabad bypoll) పక్కనే జరుగుతుండటంతో సీఈసీ (election commission of india) ఆదేశాలు అడ్డంకిగా మారనున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం.. ఉపఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో బహిరంగ సభలు నిషేధమని ఈసీ తెలిపింది. దీనితో పాటు కరోనా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాల్సిందేనని సీఈసీ వెల్లడించింది. కాగా... ఎల్కతుర్తి సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ పార్టీ.. దాదాపు లక్షమందితో సభను విజయవంతంగా నిర్వహించాలని యోచిస్తోంది. కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి భారీగా జనసమీకరణ చేపట్టాలని టీఆర్ఎస్ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే సీఎం సభకు సంబంధించి టీఆర్ఎస్ నాయకులు కూడా బహిరంగ సభ జరిగే స్థలాన్ని పరిశీలించారు. అయితే అనుకోకుండా ఈరోజే ఎన్నికల సంఘం కొత్త గైడ్‌లైన్స్‌ను అమల్లోకి తీసుకురావడంతో టీఆర్ఎస్ శ్రేణులు షాక్‌కు గురయ్యారు. అలాగే 1000 మందికి మించి రాజకీయ సమావేశాలు నిర్వహించరాదని కూడా ఈసీ తన ఆదేశాల్లో తెలిపింది. 

Also Read:Huzurabad bypoll: ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధించిన ఈసీ

కాగా, టీఆర్ఎస్‌లో కీలకనేతగా వున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ (etela rajender) భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్ (trs) పార్టీ సభ్యత్వానికి , మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. అనంతరం ఢిల్లీలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈటల రాజేందర్ రాజీనామాతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో బీజేపీ తరపు నుంచి ఈటల, కాంగ్రెస్ నుంచి వెంకట్ బల్మూరి (venkat balmoor) , టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌లు (srinivas yadav) బరిలో నిలిచారు. 

హుజూరాబాద్‌ ఉపఎన్నికకు సంబంధించి అక్టోబర్ 1 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. ఈనెల 8 వరకు హుజూరాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించారు. అక్టోబర్‌ 11న నామినేషన్ల పరిశీలనతో పాటు ఉపసంహరణకు ఈ రోజు వరకు గడువు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈనెల 30న పోలింగ్‌ జరగనుండగా నవంబర్‌ 2న ఓట్లలెక్కింపు చేపట్టనున్నారు. ఉపపోరుకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్‌ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి వారికి నిబంధనలను వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios