హైదరాబాద్: కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ తీవ్రంగా ప్రతిస్పందించింది. రేవంత్ రెడ్డిపై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. 

శనివారం రాత్రి కొడంగల్‌ నియోజకవర్గంలో భయాందోళనలు రేవంత్ రెడ్డి భయాందోళనలు సృష్టించారని, ఈ నెల 4న సీఎం కేసీఆర్‌ సభను అడ్డుకుంటానని చెప్పి బంద్‌కు పిలుపునిచ్చారని వారు ఫిర్యాదు చేశారు.

రేవంత్ రెడ్డి వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి సీఈఓ ఆదేశాలు జారీచేశారు. కొడంగల్‌ ప్రజలను రేవంత్ రెడ్డి అకారణంగా రెచ్చగొడుతున్నారని టీఆర్‌ఎస్‌ ఫిర్యాదులో తెలిపింది. ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సహా ఆధారాలను కూడా సమర్పించింది.  

రేవంత్‌పై ఏ విధమైన చర్యలు తీసుకున్నారో సోమవారంలోగా వివరణ ఇవ్వాలని సీఈఓ డీజీపిని ఆదేశించారు.