రెండు రాష్ట్రాల్లో శాసన సభ కోటాలో చెరొక ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అందులో భాగంగా ఎన్నిక నిర్వహణకు సంబంధించి ఈనెల 21న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేసన్లకు చివరి తేది ఈనెల 28 కాగా మార్చి 1న నామినేషన్ల పరిశీలిన మార్చ్ 5న నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఇవ్వగా మార్చి 12న పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపింది.  

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికల సైరన్ మోగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుద చేసింది ఎన్నికల సంఘం. దీంతో రెండు రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్లైంది. 

రెండు రాష్ట్రాల్లో శాసన సభ కోటాలో చెరొక ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అందులో భాగంగా ఎన్నిక నిర్వహణకు సంబంధించి ఈనెల 21న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేసన్లకు చివరి తేది ఈనెల 28 కాగా మార్చి 1న నామినేషన్ల పరిశీలిన మార్చ్ 5న నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఇవ్వగా మార్చి 12న పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. 

ఈ పోలింగ్ ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు జరగనుందని అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్, ఫలితాలు విడుదల కానున్నాయి. మార్చి 15తో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వ్యవహారం ముగింపు పలకనుంది. 

ఇకపోతే ఏపీ శాసనమండలి నుంచి నారాయణ, ఎ.లక్ష్మీశివకుమారి, పి.శమంతకమణి, యనమల రామకృష్ణుడు, ఆదిరెడ్డి అప్పారావు తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకోనున్నారు. అటు తెలంగాణ శాసన మండలి నుంచి పొంగులేటి సుధాకర్‌ రెడ్డి, షబ్బీర్‌ అలీ, టీ. సంతోష్‌కుమార్‌, మహ్మద్‌ సలీమ్‌, మహముద్‌ అలీలు రిటైర్ కానున్నారు. మెుత్తం పది స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.