టీఆర్ఎస్ సీనియర్ నేత, మంత్రి జగదీశ్ రెడ్డికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.  మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు గాను నోటీసులు ఇచ్చింది. శనివారం మధ్యాహ్నం 3 గంటల లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 

అంతముందు శుక్రవారం మంత్రి జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికతోనే బీజేపీ పతనం ప్రారంభమైందన్నారు. రామచంద్రభారతి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మధ్య ఆడియో సంభాషణ మీడియాలో ప్రసారమైన తర్వాత జగదీష్ రెడ్డి స్పందించారు. బండి సంజయ్ బొక్కబోర్లాపడ్డారని... బీజేపీ కుట్రను తమ పార్టీ ఎమ్మెల్యేలు బయటపెట్టారని ఆయన చెప్పారు. స్వాములను బీజేపీ నమ్ముకుందన్నారు. దొంగలను పట్టుకోవడంలో తమ పార్టీ ఎమ్మెల్యేలు విజయం సాధించారన్న జగదీశ్ రెడ్డి.. ఇప్పుడు అమిత్ షా వచ్చి యాదాద్రిలో ప్రమాణం చేస్తారా అని ప్రశ్నించారు.

ALso REad:Pమా ఎమ్మెల్యేలు దొంగలను పట్టుకున్నారు: రోహిత్ రెడ్డి,రామచంద్రభారతి ఆడియోపై మంత్రి జగదీష్ రెడ్డి

మొయినాబాద్ ఫాం హౌస్ లో ఎమ్మెల్యేల కు జరిగిన ప్రలోభాల అంశంపై వాస్తవాలు బయటకు వస్తున్నాయన్నారు. బీజేపీ నేతలు ప్రజల ముందు దోషులుగా నిలబడ్డారని ఆయన చెప్పారు. ఎమ్మెల్యేల ప్రలోభాల అంశంపై చట్టం తన పని తాను చేసుకుపోతోందని . నెకల రోజుల్లో టీఆర్ఎస్ సర్కార్ ను కూలగొడుతామని కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.