వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి కేంద్ర ఎన్నకల సంఘం షాక్ ఇచ్చింది. శుక్రవారం జరిగిన రాజ్యసభ ఎన్నకల్లో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఓటు వేసే క్రమంలో ఆయన చేసిన చిన్న పొరపాటు ఆయనకు ఇబ్బందికరంగా మారింది. ఓటు వేసే సమయంలో తన బ్యలెట్ పేపర్ ను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పోలింగ్ ఏజెంట్ కు చూపించి మరీ బ్యాలెట్ బాక్స్ లో వేశారు.

ఈ విషయమై అధికార టిఆర్ఎస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రహస్యంగా వేసిన ఓటు చెల్లుబాటు కాదని, ఆయన ఓటును పరిగణలోకి తీసుకోరాదని కోరింది.

అధికార టిఆర్ఎస్ పార్టీ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం దొంతి మాధవరెడడ్ ఓటును పరిగణలోకి తీసుకోరాదని ఆదేశాలు జారీ చేసింది.

మొత్తానికి ఇప్పటికే ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంతప్ కుమార్ ల ఓటు హక్కు కోల్పోగా... ఓటు హక్కు ఉన్నప్పటికీ టిడిపి నుంచి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకోలేదు.

తీరా ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అయినా కాంగ్రెస్ కు అనుబంధంగా ఉన్న దొంతి మాధవరెడ్డి ఓటు కూడా కాంగ్రెస్ ఖాతాలోకి రాకుండా పోవడం ఆ పార్టీకి ఆందోళన కలిగించే అంశంగా చెబుతున్నారు.