ఈసీ ఆదేశాలు:తెలంగాణలో 10 జిల్లాలకు కొత్త ఎస్పీలు, నాలుగు జిల్లాలకు కొత్త కలెక్టర్లు

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని  పలువురు అధికారులపై  ఈసీ  ఆగ్రహం వ్యక్తం చేసింది. పలువురు అధికారులను విధుల నుండి తప్పించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

EC appoints New SPs and CPs in Telangana lns

హైదరాబాద్: తెలంగాణలో  ఎన్నికల నేపథ్యంలో  పలు జిల్లాలకు కొత్త ఎస్పీలను  నియమిస్తూ  తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం  జాబితాను పంపింది.ఎన్నికల  విధుల్లో నిర్లక్ష్యం వహించారనే కారణంగా  నాలుగు జిల్లాల కలెక్టర్లు, 13 జిల్లాల ఎస్పీలు, ముగ్గురు సీపీలను విధులనుండి ఈసీ తప్పించింది.  ఈ అధికారుల స్థానంలో కొత్త అధికారులను నియమించేందుకు అధికారుల జాబితాను పంపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  శాంతి కుమారిని  ఈసీ  ఆదేశించింది.

also read:ఈసీ ఆదేశాలు: తెలంగాణలో 13 జిల్లాలకు కొత్త ఎస్పీలు

 దీంతో  నిన్న సాయంత్రం  ఈసీకి  అధికారుల జాబితాను పంపారు రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి. సీఎస్ పంపిన జాబితా ఆధారంగా  10 జిల్లాలకు ఎస్పీల  నియామాకాన్ని ఖరారు చేసింది ఈసీ.   హైద్రాబాద్ సీపీ  పోస్టుకు ఇంకా అధికారిని ఖరారు చేయలేదు.

కొత్తగా నియమితులైన అధికారులు వీరే

వరంగల్ సీపీ- అంబర్ కిషోర్ ఝా
సంగారెడ్డి సీపీ- రూపేష్
నాగర్ కర్నూల్ - వైభవ్ గైక్వాడ్
జగిత్యాల - సంప్రీత్ సింగ్
మహబూబ్ నగర్ -హర్షవర్ధన్
నారాయణపేట- యోగేష్ గౌతమ్
నిజామాబాద్-  కల్మేశ్వర్
జోగులాంబ- రితీరాజ్
మహబూబాబాద్- పాటిల్ సంఘం సింగ్
కామారెడ్డి- సింధూశర్మ
భూపాలపల్లి- కారే కిరణ్
సూర్యాపేట- రాహుల్ హెగ్డే

కొత్త కలెక్టర్ల నియామకం


రంగారెడ్డి- భారతి హోలికేరీ
మేడ్చల్  -గౌతం
యాదాద్రిభువనగి -హనుమంత్
నిర్మల్ -ఆశిష్ సంగ్వాన్
రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి -వాణీ ప్రసాద్
వాణిజ్య పన్నుల శాఖ- క్రిస్టినా
ఎక్సైజ్ శాఖ కమిషనర్ -జ్యోతి బుద్ద ప్రకాష్

ఈసీ పంపిన జాబితా ఆధారంగా  రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి  ఇవాళ ఆదేశాలు జారీ చేశారు.ఇవాళ  సాయంత్రం వరకు  బాధ్యతలు చేపట్టాలని  సీఎస్ ఆదేశాలు జారీ చేశారు సీఎస్.

తెలంగాణ రాష్ట్రంలో  ఎన్నికల సన్నద్దతపై  సీఈసీ రాజీవ్ కుమార్ నేతృత్వంలో టీమ్  ఈ నెల 3 నుండి 5వ తేదీ వరకు రాష్ట్రంలో పర్యటించింది.కొందరు అధికారులపై రాజకీయ పార్టీల నేతలు ఫిర్యాదు చేశారు.  ఆయా శాఖల్లో పనిచేస్తున్న అధికారులపై కాంగ్రెస్ పార్టీ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. మరో వైపు ఈసీ బృందం కూడ అధికారుల తీరును పరిశీలించింది. ఈ మేరకు కొందరు అధికారులను విధుల నుండి తప్పించాలని సూచించింది.  ఎన్నికలు పూర్తయ్యే వరకు విధుల నుండి తప్పించిన వారికి ఎలాంటి బాధ్యతలు కేటాయించవద్దని  ఈసీ  తేల్చి చెప్పింది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios