Asianet News TeluguAsianet News Telugu

ఈటల రాజేందర్ రికార్డు: గత ఏడేళ్లలో ఇలాంటి రాజీనామా ఇదే తొలిసారి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ఏడేళ్ల కాలంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తొలి ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ రికార్డులకు ఎక్కాడు. అంతకు ముందు ఆయన రెండుసార్లు రాజీనామా చేశారు.

Eatela Rajender is the only the TRS MLA resigned as MLA after the formation of Telangana govt
Author
Hyderabad, First Published Jun 12, 2021, 3:25 PM IST

హైదారబాద్: రాష్ట్ర విభజన జరిగిన తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడేళ్లలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తొలి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ రికార్డు సృష్టించారు. ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేయడం ఇది మూడోసారి. 2008, 2010ల్లో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 

17 ఏళ్ల పాటు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈటలె రాజేందర్ చేసిన రాజీనామాను వెంటనే స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి వెంటనే ఆమోదించారు. హుజురాబాద్ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించారు. ఆ విషయాన్ని ఆయన ఎన్నికల కమిషన్ కు కూడా తెలియజేశారు. దంతో వచ్చే ఆరు నెలల లోపల హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది.

టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ సోమవారం బిజెపిలో చేరే అవకాశాలున్నాయి. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, కరీంనగర్ మాజీ చైర్ పర్సన్ తుల ఉమ, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, తెలంగాణ ఆర్టీసీ యూనియన్ నాయకుడు అశ్వత్థామ రెడ్డి తదితరులు బిజెపిలో చేరే అవకాశం ఉంది.

తన రాజీనామాకు ముందు ఈటల రాజేందర్ తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. హుజూర్ నగర్ లో జరిగేది కేసీఆర్ అహంకారానికి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య పోరాటమని ఆయన అన్నారు. కేసీఆర్ పాలనకు ఘోరీ కట్టాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. 

ఇతర పార్టీల నుంచి వచ్చినవాళ్లు మంత్రులుగా కొనసాగుతున్నారని, పార్ట మారే సమయంలో వారు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయలేదని ాయన అన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇటువంటి స్థితిలో రాజీనామా చేయవద్దని కొందరు చెప్పారని, కేసీఆర్ వద్ద వందల వేల కోట్ల డబ్బులు ఉన్నాయని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతారని, తద్వారా హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ ను గెలిపించుకునే అవకాశం ఉందని అంటున్నారని ఆయన అన్నారు. 17 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేశానని, యావత్ తెలంగాణ ప్రజల కోసం తాను రాజీనామా చేస్తున్నానని ఆయన చెప్పారు.

అయితే, తాను రాజీనామా చేయడానికే సిద్ధపడినట్లు ఆయన తెలిపారు. వాళ్లు తొలగించాల్సిన పరిస్థితి వస్తే రాజీనామా చేయాలని చెప్పారని ఆయన అన్నారు హుజూరాబాద్ లో జరిగేది కురుక్షేత్రమేనని ఆయన అన్నారు. హుజూరాబాద్ ప్రజలు నిర్బంధాలకు, అరెస్టులకు, కేసులకు భయపడరని ఆయన అన్నారు. కేసీఆర్ పాలనను ప్రజలు ఛీకొడుతున్నారని ఆయన అన్నారు. 

తనది వామపక్ష ఎడెండా కాదని, కేసీఆర్ కుటుంబ పాలనకు ఘోరీ కట్టడమే తన ఎజెండా అని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారానికి మేధావులు, తదితరులతో ఓ కమిటీ వేస్తానని కేసీఆర్ చెప్పారని, ఆ హామీని గంగలో కలిపారని, సమస్యలను చెప్పుకునే దిక్కు కూడా తెలంగాణలో లేదని ఆయన అన్నారు. తనకు టీఆర్ఎస్ బీ ఫారం ఇచ్చి ఉండవచ్చు గానీ గెలిపించింది ప్రజలేనని ఆయన అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios