Asianet News TeluguAsianet News Telugu

BJP: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మల్కజ్‌గిరి నుంచి ఈటల రాజేందర్ పోటీ

ఈటల రాజేందర్ వచ్చే లోక్ సభ  ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. మల్కజ్‌గిరి స్థానం నుంచి ఆయన పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పార్టీ హైకమాండ్ ఆదేశిస్తూ మల్కాజ్‌గిరి లోక్ సభ స్థానం నుంచి పోటీచేస్తానని ఈటల తెలిపారు.
 

eatala rajender to contest from malkajgiri lok sabha seat kms
Author
First Published Feb 21, 2024, 3:44 PM IST | Last Updated Feb 21, 2024, 3:44 PM IST

Eatala Rajender: బీజేపీ నేత ఈటల రాజేందర్ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. పార్టీ హైకమాండ్ ఆదేశిస్తే.. మల్కజ్‌గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పారు. మల్కజ్‌గిరి నుంచి పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ విజయ సంకల్ప యాత్రలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ యాత్రలోనే ఈటల రాజేందర్ బుధవారం యాదాద్రిలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు. నరేంద్ర మోడీ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని వివరించారు. దేశాభివృద్ధికి పాటుపడుతున్నారని తెలిపారు. నరేంద్ర మోడీకి మూడోసారి ప్రధాని బాధ్యతలు అప్పగించడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని చెప్పారు. అదే విధంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ పార్టీ అలవికాని హామీలు ఇచ్చిందని ఈటల రాజేందర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ బూటకపు హామీల్లోని డొల్లతనం ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థం అవుతున్నదని ఫైర్ అయ్యారు. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని పేర్కొంటూ ఈ పథకం ద్వారా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని వివరించారు. అయితే.. అందుకు తగినట్టుగా బస్సు సేవలను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ సఫలం కాలేకపోతున్నదని కామెంట్ చేశారు.

Also Read: BRS Party: 2036 వరకు బీఆర్ఎస్ పార్టీని డిస్‌క్వాలిఫై చేస్తారా?

రాష్ట్రానికి అంత పెద్ద మొత్తంలో అప్పులు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈటల రాజేందర్ విమర్శించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, హుజురాబాద్‌లో ఓడిపోయారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఈటల రాజేందర్ ఉవ్విళ్లూరుతున్నారని చెప్పడానికి ఈ వ్యాఖ్యలు నిదర్శనం అని చర్చిస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios