Asianet News TeluguAsianet News Telugu

నాతో ఇంత ఘోరంగానా... నీకు ఘోరీ కట్టడం ఖాయం: కేసీఆర్ కు ఈటల వార్నింగ్

తల్లి తండ్రి విడిపోయినప్పుడు పిల్లలను పంచుకునే సమయంలో తల్లిదండ్రులు పడే వేదన నాది, మా ప్రజాప్రతినిధులది అని రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు.  

eatala rajender strong warning to cm kcr akp
Author
Huzurabad, First Published Jun 23, 2021, 4:04 PM IST

కరీంనగర్: హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులతో తనకు తల్లిదండ్రులు, పిల్లలకు మధ్య సంబంధం ఉందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. తల్లి తండ్రి విడిపోయినప్పుడు పిల్లలను పంచుకునే సమయంలో తల్లిదండ్రులు పడే వేదన నాది, మా ప్రజాప్రతినిధులది అని రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు.  

ఇళ్లంతకుంట మండల బిజేపి కార్యకర్తలతో ఈటల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసిఆర్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేసిఆర్ దుర్మార్గాలకు గొరి కట్టే బాధ్యత హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలపై ఉందన్నారు. 

''కొందరు ప్రజాప్రతినిధులను, తనను విడగొట్టి కేసీఆర్ పాపం మూటగట్టుకున్నారు. నాతో చాలా ఘోరంగా వ్యవహరించారు. నాపై వచ్చిన ఆరోపణలపై కనీసం వివరణ కోరకుండా మంత్రి పదవి నుంచి తొలగించారు'' అని ఆవేధన వ్యక్తం చేశారు.

read more హుజూరాబాద్‌ బైపోల్: బీజేపీకి ఆ సెంటిమెంట్ కలిసి వచ్చేనా?

''కనీసం స్పీకర్ కూడా రాజీనామా పత్రం తీసుకునేందుకు రాలేదు. ఆరుసార్లు ఎమ్మెల్యే గా గెలిచిన నన్ను కనీసం వివరణ కోరకుండా రాజీనామాను ఆమోదించారు. ఎందుకంటే అసెంబ్లీలో ఈటల రాజేందర్ అనేటోడు ఉంటే వరిదాన్యం కొనుగోలు కేంద్రాల గురించి, పింఛన్లు ఎందుకు ఇవ్వడం లేదనీ ప్రశ్నిస్తాడు. అందుకే వీడు అసెంబ్లీకి రావద్దని అడ్డుకున్నారు. కానీ మీ కుట్రలకు తగిన బుద్ది చెప్పేందుకు హుజూరాబాద్ ప్రజలు సిద్ధంగా ఉండాలి'' అని సూచించారు. 

''టీఆర్ఎస్ పార్టీలో వుండగా నాకు పదవులు వట్టిగా రాలే... పోరాడితే, కష్ట పడితే వచ్చాయి. రైలు పట్టాల పై పడుకున్నాం, అనేక కేసులు బరిస్తే వచ్చాయి. హుజూరాబాద్ ఎన్నికల్లో విజయం ప్రజల విజయం. నేను గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచి నట్టు, ఓడితే ప్రజాస్వామ్యం ఒడినట్టు'' అని అన్నారు ఈటల రాజేందర్. 
 

Follow Us:
Download App:
  • android
  • ios