Asianet News TeluguAsianet News Telugu

లేసినోడు, లేవనోడు ప్రతి ఒక్కడు మాట్లాడుతుండు...: ఈటల సంచలన వ్యాఖ్యలు

టీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలకు ఖర్చు చేస్తున్నది ఎవరి సొమ్మో కాదు.... అది మన సొమ్మే... ఎవరి దయా దాక్షన్యాలు మనకు అవసరం లేదని ఈటల రాజేందర్ అన్నారు. 

eatala rajender sensational comments on trs leaders akp
Author
Huzurabad, First Published Jun 23, 2021, 7:36 PM IST

హుజురాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ మాటమాటకు టీఆర్ఎస్ గెలిస్తేనే పథకాలు వస్తాయి అని చెబుతున్నారని... అయితే ఆయన తన ఇంట్లో నుండి పథకాలకు పైసలు ఇవ్వడం లేదని గుర్తించాలని మాజీ మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. పథకాలకు ఖర్చు చేస్తున్నది ఎవరి సొమ్మో కాదు.... అది మన సొమ్మే... ఎవరి దయ దాక్షన్యాలు మనకు అవసరం లేదని ఈటల విరుచుకుపడ్డారు. 

జమ్మికుంట పట్టణంలోని సాయి గార్డెన్లో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఈటల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలు పెన్షన్లు ఇస్తున్నారు అని భావిస్తున్నారు కానీ అవి తమ పైసలు అని మరిచిపోతున్నారని పేర్కొన్నారు. మనం ఏది కొన్న టాక్స్ లు కడుతాం... ఏ పథకం అయిన అవి మనం కట్టే టాక్సీల వల్ల వస్తాయన్నారు. 

''హుజురాబాద్ పరిధిలోని జెడ్పీటీసీ, ఎంపిపి, సర్పంచ్ లను నేను ఇంటింటికీ తిరిగి దండం పెట్టి గెలిపించుకున్నా. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు వచ్చి గెలిపించ లేదు. ఒళ్లు వంచి, చెమట విడిచి, పెళ్ళాం, పిల్లలకు దూరం ఉండి ధర్నాలు, రాస్తారోకోలు చేసి రాష్ట్రం సాధించుకొని ఈ స్థాయికి వచ్చాం. కేవలం బీఫారం ఒక్కటే గెలిపించదు. ప్రజల మన్నలు పొందినప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది'' అన్నారు. 

read more  నాతో ఇంత ఘోరంగానా... నీకు ఘోరీ కట్టడం ఖాయం: కేసీఆర్ కు ఈటల వార్నింగ్

''నాతో పాటు నా టేబుళ్ళ పై కూర్చోని తిన్నోల్లు ఇప్పుడు నాకు దూరం అయ్యారు. ఐదుగురు మంత్రులు, పది మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో తిరుగుతున్నారు. లేసినోడు, లేవనోడు ప్రతి ఒక్కడు మాట్లాడుతుండు.. వారి అందరి గురించి నాకు తెలుసు'' అంటూ తీవ్రస్థాయిలో విరుచకుపడ్డారు. 

''ఒక్క వ్యక్తి ఉద్యమం చేస్తే తెలంగాణ రాలేదు. చీమలు పుట్టలు పెడితే పాములు వచ్చి చేరినయి ఒకడు అంటడు. పాము లాగ వాడు చేరిండా.. నేను చేరాన. గజకరి లాగ వ్యవహరిస్తున్నారు. గజకరి అంటే తానే కొట్టి రోడ్డు మీదకు వచ్చి నన్ను కొట్టిర్రు అని మొత్తు కున్నట్లు'' అంటూ మండిపడ్డారు. 

''ఆనాడు మంత్రి అంటే ఒక చిటిక వేస్తే పని అయ్యేది. కాని ఈ ప్రభుత్వంలో మంత్రి వెళ్లి కేసీఆర్ కు చెప్పుకున్న పని కావడం లేదు. ప్రస్తుతం యావత్ తెలంగాణ మొత్తం హుజురాబాద్ వైపు చూస్తుంది. ఏ ప్రభుత్యం వచ్చిన పథకాలు ఎటుపోవు. అంతకంటే మెరుగైన పథకాలు వస్తాయి'' అని ఈటల రాజేందర్ తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios