Asianet News Telugu

మెప్పు కోసం తంటాలు.. నాకు పట్టిన గతే పడుతుంది : హరీశ్ రావు‌పై ఈటల సంచలన వ్యాఖ్యలు

హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ నేత, మంత్రి హరీశ్ రావుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత ఈటల రాజేందర్. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు హరీశ్ రావు విందులు ఏర్పాటు చేస్తున్నాడని, డబ్బులు ఇస్తున్నాడని ఈటల ఆరోపించారు

eatala rajender sensational comments on harish rao over huzurabad by election ksp
Author
Hyderabad, First Published Jul 6, 2021, 9:01 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ నేత, మంత్రి హరీశ్ రావుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత ఈటల రాజేందర్. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు హరీశ్ రావు విందులు ఏర్పాటు చేస్తున్నాడని, డబ్బులు ఇస్తున్నాడని ఈటల ఆరోపించారు. పార్టీ పెద్దల మెప్పు పొందాలని చూస్తున్నాడని విమర్శించారు. త్వరలో హరీశ్ రావుకు కూడా తనకు పట్టిన గతే పడుతుందని రాజేందర్ హెచ్చరించారు. హుజూరాబాద్‌‌లో తన విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఈటల ధీమా వ్యక్తం చేశారు.

Also Read:ఈటలకు బిగ్ షాక్... టీఆర్ఎస్ గూటికి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సమ్మిరెడ్డి

మీ పార్టీ నుంచి గెలిచానని అన్నారుగా... అందుకే రాజీనామా చేశానని రాజేందర్ స్పష్టం చేశారు. డబ్బు, ఇతర ప్రలోభాలను పాతరేసే సత్తా హుజూరాబాద్ ప్రజలకు ఉందని ఈటల స్పష్టం చేశారు. తమతో తిరిగే యువకులను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరినీ బెదిరించి టీఆర్ఎస్ కండువాలు కప్పుతున్నారని రాజేందర్ ఆరోపించారు. సీఎస్, డీజీపీ చట్టానికి లోబడి పనిచేయాలని, కొందరికి చుట్టంగా కాదంటూ ఈయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios