ఈటలకు బిగ్ షాక్... టీఆర్ఎస్ గూటికి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సమ్మిరెడ్డి
ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరిన ఈటల వెంటే ఇంతకాలం ప్రయాణంచేసిన ప్రధాన అనుచరుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మెటి సమ్మిరెడ్డి తిరిగి సొంతగూటికి చేరాడు.
హుజురాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరిన ఈటల వెంటే ఇంతకాలం ప్రయాణంచేసిన ప్రధాన అనుచరుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మెటి సమ్మిరెడ్డి తిరిగి సొంతగూటికి చేరాడు. తన అనుచరులో కలిసి టీఆర్ఎస్ లో చేరాడు సమ్మిరెడ్డి.
ఈ సందర్భంగా సమ్మిరెడ్డి మాట్లాడుతూ... ఈటలను బర్తరఫ్ చేసినా ఆయన వెన్నంటే ఉన్నామని... చేసిన తప్పులు సరిదిద్దుకుని పార్టీలోనే ఉంటాడని అనుకున్నామన్నారు. బిజెపిలో చెరే విషయాన్ని తాను విభేదించానని... కానీ ఆస్తుల రక్షణ కోసమే ఆయన మతతత్వ బిజెపి చేరిండని అన్నారు.
read more ఈటలకు షాక్... టీఆర్ఎస్ కే మద్దతంటూ రైస్ మిల్లర్ల ఏకగ్రీవ తీర్మానం
''ఈటల రాజేందర్ ప్రభుత్వాన్ని కులగొట్టే ప్రయత్నలు చేస్తున్నాడనే తెలిసింది. రాష్ట్ర క్యాబినెట్ లో ఉండి ప్రభుత్వ పథకాలను వ్యతిరేకించిండు. ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనతో ఉన్నాడనే ఆయనను మంత్రి వర్గం నుండి బర్తరఫ్ చేశారు'' అని సమ్మిరెడ్డి ఆరోపించారు.
''హుజూరాబాద్ నియోజకవర్గంలో అధికారులపై పట్టు లేకుండా నాణ్యత లేని పనులు చెయించాడు. నియోజక వర్గంలో టీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డా కూలీలుగా మార్చాడు'' అంటూ ఈటల రాజేందర్ పై సమ్మిరెడ్డి విరుచుకుపడ్డాడు.