Asianet News TeluguAsianet News Telugu

సంగారెడ్డిలో భూ ప్రకంపనలు .. రోడ్ల మీదకు పరుగులు పెట్టిన జనాలు , 10 రోజుల్లో రెండోసారి

రోజుల వ్యవధిలో సంగారెడ్డి జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. న్యాల్ కల్ మండల కేంద్రంలో భూకంపం సంభవించింది. అయితే ఈ భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. కానీ పది రోజుల వ్యవధిలో ఇదే ప్రాంతంలో భూ ప్రకంపనలు చోటు చేసుకోవడం పట్ల ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. 

earthquake in nyalkal mandal in sangareddy district ksp
Author
First Published Feb 6, 2024, 8:57 PM IST

రోజుల వ్యవధిలో సంగారెడ్డి జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. న్యాల్ కల్ మండల కేంద్రంలో భూకంపం సంభవించింది. మంగళవారం సాయంత్రం 7.26 గంటల సమయంలో 4 నుంచి 5 సెకన్ల మేర భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భారీ శబ్ధంతో పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఇళ్లలోని సామాన్లు , కిటికీలు ఊగడంతో ప్రజలు ప్రాణభయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు. 

ఇకపోతే.. గత నెల 27న న్యాల్ కల్ మండలంలోని న్యాల్ కల్, ముంగి గ్రామాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ సమయంలో వింత వింత శబ్ధాలు వచ్చినట్లు ప్రజలు తెలిపారు. అయితే ఈ భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. కానీ పది రోజుల వ్యవధిలో ఇదే ప్రాంతంలో భూ ప్రకంపనలు చోటు చేసుకోవడం పట్ల ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios