Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో ‘‘ TS EAPCET ’’ గా మారిన ‘‘ EAMCET ’’... ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఇదే

ఇంజనీరింగ్ , మెడిసిన్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన "EAMCET" పేరును తెలంగాణ ప్రభుత్వం మార్చింది. ఇప్పటి వరకు టీఎస్ ఎసెంట్‌గా వున్న పేరును ‘‘ TS EAPCET ’’ (తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)గా మార్చింది. 

eamcet name changed in telangana as eapcet and entrance exam dates have been finalized ksp
Author
First Published Jan 25, 2024, 7:51 PM IST

ఇంజనీరింగ్ , మెడిసిన్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన "EAMCET" పేరును తెలంగాణ ప్రభుత్వం మార్చింది. ఇప్పటి వరకు టీఎస్ ఎసెంట్‌గా వున్న పేరును ‘‘ TS EAPCET ’’ (తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)గా మార్చింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే ఎనిమిది ప్రవేశ పరీక్షలకు షెడ్యూల్‌ను విడుదల చేసింది తెలంగాణ ఉన్నత విద్యా మండలి. వీటిలో ఈసెట్‌, లాసెట్‌, పీజీసెట్‌, ఐసెట్‌, ఎడ్‌సెట్‌, పీజీఈ సెట్‌ వున్నాయి 

ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు :

  • మే 6 , 2024 : తెలంగాణ ఈసెట్
  • మే 9 నుంచి 11 వరకు : టీఎస్ ఈఏపీసెట్ (ఇంజనీరింగ్)
  • మే 12, 13 : టీఎస్ ఈఏపీసెట్ (అగ్రికల్చర్ అండ్ ఫార్మా)
  • మే 23 : టీఎస్ ఎడ్‌సెట్ 
  • జూన్ 3 : టీఎస్ లా సెట్ : పీజీ ఎల్‌సెట్
  • జూన్ 4, 5 : టీఎస్ ఐసెట్ 
  • జూన్ 6 నుంచి 8 వరకు : టీఎస్ పీజీఈసెట్
  • జూన్ 10 నుంచి 13 వరకు : టీఎస్ పీఈసెట్

కాగా.. ఎంసెట్‌లె మెడికల్ లేకపోవడంతో ‘‘ఎం’’ అన్న పదాన్ని తొలగించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ క్రమంలోనే అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీనికి ప్రభుత్వం ఆమోదముద్ర వేయడంతో ఇవాళ అధికారికంగా ఎంసెట్ పేరును మార్చారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో మెడికల్ సీట్ల భర్తీకి ‘‘నీట్ యూజీ’’ ప్రవేశ పరీక్షను ప్రవేశపెట్టింది. దీంతో ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి మెడికల్ కోర్సులు, కాలేజీలు ఎంసెట్‌ నుంచి దూరమయ్యాయి. అయినప్పటికీ ఎంసెట్ పేరును యథావిధిగా కొనసాగిస్తున్నారు. 

ఏపీలోనూ ఏపీ ఈఏపీ సెట్ అనే పేరును ఖరారు చేయడంతో తెలంగాణ ప్రభుత్వం సైతం ఎంసెట్ పేరు మార్పుకు మొగ్గుచూపింది. ఉమ్మడి రాష్ట్రంలో నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో తొలిసారిగా ఎంసెట్ పరీక్షను ప్రవేశపెట్టారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios