ఈ-చలాన్ వెబ్ సైట్ డౌన్.. నకిలీ పోర్టల్స్ తో రెచ్చిపోతున్న కేటుగాళ్లు..

తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు కట్టేందుకు వాహనదారులు Telangana State Police Integrated e-Challan System కు పోటెత్తుతున్నారు. అయితే ఈ క్రమంలో నకిలీ వెబ్ సైట్లను ఆశ్రయించి మోసపోతున్నారు. దీనిపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

E challan website down.. Scammers are getting angry with fake portals..ISR

తెలంగాణలో ట్రాఫిక్ చలాన్లపై ప్రభుత్వం భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. అయితే ఈ ఆఫర్లు ప్రారంభమైన కొద్ది రోజులకే తెలంగాణ ట్రాఫిక్ పోలీసుల ఈ-చలాన్ వెబ్ సైట్ సర్వర్ తాత్కాలికంగా డౌన్ అయింది. దీనిని అవకాశంగా తీసుకొని కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. నకిలీ వెబ్ సైట్లు తయారు చేసి వాహనదారుల నుంచి డబ్బులు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి ఓ పోర్టల్ ను పోలీసులు (http://echallanstspolice.in/)గుర్తించారు. ఇలాంటి వెబ్ సైట్స్ తో జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. 

ల్యాండ్ క్రూయిజర్ల కొనాలన్నది భద్రతా విభాగం నిర్ణయం - కల్వకుంట్ల కవిత..

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు ప్రకటించడంతో వాటిని చెల్లించడానికి చాలా మంది వినియోగదారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే వెహికల్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు దానికి సంబంధించిన వివరాలు రావడం లేదు. సాధారణంగా వాహన రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత పెండింగ్ చలాన్ల వివరాలను చూపించే వెబ్ సైట్ వినియోగదారులను పేమెంట్ గేట్ వేకు తీసుకెళ్తుంది. అయితే గత కొన్ని రోజులుగా సర్వర్ డౌన్ కావడంతో వినియోగదారులు చెల్లింపులు చేయలేకపోతున్నారు.

అయితే వాహనదారులు అధికంగా ఆ వైబ్ సైట్ పోటెత్తుతుండటంతో సర్వర్ సమస్యలు తలెత్తుతున్నాయని, పెండింగ్ చలాన్లు పోర్టల్లో కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు. గత రెండు రోజులుగా సర్వర్ సమస్యలు ఎదురవుతున్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వాహనదారులు అవసరమైతే సమీపంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో చలాన్లు చెల్లించవచ్చని ట్రాఫిక్ పోలీసు అధికారులు చెబుతున్నారు.

శ్రీమంతురాలు కావాలని నలుగురిని పెళ్లి చేసుకున్న యువతి.. తరువాత ఏం జరిగిందంటే ?

కాగా.. చాలా మంది వినియోగదారులు నకిలీ వెబ్ సైట్లను ఆశ్రయించి మోసపోతున్నారు. పెండింగ్ చలాన్లు కట్టేందుకు వాహనదారులు వెబ్ సైట్ లో వెహికిల్ డిటెయిల్స్ ఎంటర్ చేసి డబ్బులు చెల్లించేస్తున్నారు. అయితే మళ్లీ చెక్ చేసుకుంటే మాత్రం అవే చలాన్లు కనిపిస్తున్నాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నకిలీ పోర్టల్స్ లో చెల్లింపులు చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, నకిలీ పోర్టళ్లలో వ్యక్తిగత వివరాలను పంచుకోవద్దని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios