Asianet News TeluguAsianet News Telugu

అధికారం మనదే, సమన్వయంతో ముందుకెళ్లాలని కేసీఆర్ ఆదేశం: కడియం

టీఆర్ఎస్ అభ్యర్థులతో కేసీఆర్ సమావేశం ముగిసింది. దాదాపు మూడుగంటలకు పైగా జరిగిన సమావేశంలో 105 మంది అభ్యర్థులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ మెజార్టీ ఖాయమని ఖచ్చితంంగా 100 సీట్లు గెలుస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు అభ్యర్థులు నిర్వహించిన ప్రచారంపై కేసీఆర్ ఆరా తీశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందిన ప్రతీ లబ్ధిదారుడిని నేరుగా కలవాలని అభ్యర్థులకు సూచించారు. 

dy cm pressmeet on cm meeting
Author
Hyderabad, First Published Oct 21, 2018, 7:04 PM IST

హైదరాబాద్: టీఆర్ఎస్ అభ్యర్థులతో కేసీఆర్ సమావేశం ముగిసింది. దాదాపు మూడుగంటలకు పైగా జరిగిన సమావేశంలో 105 మంది అభ్యర్థులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ మెజార్టీ ఖాయమని ఖచ్చితంంగా 100 సీట్లు గెలుస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు అభ్యర్థులు నిర్వహించిన ప్రచారంపై కేసీఆర్ ఆరా తీశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందిన ప్రతీ లబ్ధిదారుడిని నేరుగా కలవాలని అభ్యర్థులకు సూచించారు. 

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ విజయం చారిత్రక అవసరం అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. ఐదు నియోజకవర్గావల్లో టీఆర్ఎస్ కు టఫ్ ఫైట్ ఎదురుకానుందని ఆ అభ్యర్థులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించినట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రచారాన్ని వేగవంతం చెయ్యాలని సూచించారు. ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ పలు సూచనలు చేసినట్లు తెలిపారు.

నాలుగున్నరేళ్లలో టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజెయ్యాలని సూచించారు. కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్, రైతు బంధు వంటి ప్రభుత్వ పథకాలు మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. ఆయా నియోజకవర్గాల వారీగా అభివృద్ధి గణాంకాలను పుస్తక రూపంలో అభ్యర్థులకు అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధి పొందిన లబ్ధిదారుల వివరాలను పుస్తకంలో పొందుపరిచారని కడియం తెలిపారు.

దీంతో అభ్యర్థులు ఆయా లబ్ధిదారుల వద్దకు వెళ్లి టీఆర్ఎస్ కు ఓటు వేసే విధంగా ప్రయత్నించాలని ఆదేశించారు. మరోవైపు రైతుల ఓట్లు కచ్చితంగా టీఆర్ఎస్ కు వచ్చేలా ప్రతీ ఒక్కరూ ప్రభుత్వ పథకాలను ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టుల వివరాలను రైతులకు వివరించాలని సూచించారు. అలాగే రైతు బంధ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2 కోట్ల మంది రైతులు లబ్ధిపొందారని వారిని కలిసి ఓట్లు అడగాలని కేసీఆర్ ఆదేశించినట్లు కడియం తెలిపారు.

మరోవైపు ప్రతిపక్ష పార్టీల ఆరోపణలను తిప్పికొట్టాలని ఆదేశించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటుందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని,అలాగే కాంగ్రెస్-టీడీపీల పొత్తు అనైతికమంటూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని వివరించారు. టీఆర్ఎస్ పాక్షిక మేనిఫెస్టో కాంగ్రెస్ మేనిఫెస్టోను కాపీకొట్టిందంటూ వస్తున్న ఆరోణలను తిప్పి కొట్టాలని సూచించినట్లు కడియం చెప్పారు.

ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ప్రచారంపై ప్రతీ అభ్యర్థి దగ్గర నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గాల్లో అసమ్మతి ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే అభ్యర్థులకు పాక్షిక మేనిఫెస్టో, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎలా వివరించాలో అవగాహన కల్పించారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్పష్టం చేశారు.

మరోవైపు ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చెయ్యాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే దక్షిణ తెలంగాణలో నిజామాబాద్, నల్లగొండ, వనపర్తిలలో బహిరంగ సభలు నిర్వహించి విజయవంతమయ్యామని అలాగే ఉత్తర తెలంగాణలో కూడా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ను కోరినట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. 

ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని సూచించినట్లు తెలిపారు. వరంగల్ , ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో బహిరంగ సభలు నిర్వహించాలని వరంగల్ జిల్లాలో ఈనెలలోనే నిర్వహించాలని కోరినట్లు తెలిపారు. వరంగల్ లో బహిరంగ సభపై రెండు రోజుల్లో సీఎం తేదీలు ఖరారు చేస్తారన్నారు. 

రాష్ట్రంలోని 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించాలని సీఎం కేసీఆర్ ఆలోచన అని కడియం శ్రీహరి తెలిపారు. నవంబర్ 12 ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేనాటికి 30 నుంచి 40 నియోజకవర్గాల్లో సభలు పూర్తి చెయ్యాలని భావిస్తున్నట్లు తెలిపారు. నోటిఫికేషన్ అనంతరం రెండో దశ సభలు పెట్టుకోవాలని నిర్ణయించామని చివరలో టఫ్ ఫైట్ ఉన్న నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తామని తెలిపారు. 

సెప్టెంబర్ 6న తెలంగాణ శాసన సభను రద్దు చేసిన నాటి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో ఉన్నారని ఇప్పటి వరకు దాదాపు 45 రోజులు ప్రచారం నిర్వహించారని కడియం తెలిపారు. ఇంకా ఎన్నికలకు 45 రోజులు సమయం ఉండటంతో ప్రభుత్వ పథకాలను లబ్ధి పొందిన ప్రతీ వ్యక్తిని నేరుగా కలవాలని ఆదేశించినట్లు తెలిపారు. 

రాబోయే ఎన్నికల్లో 100 స్థానాల్లో గెలిచి చరిత్ర సృష్టించాలని ప్రతీ ఒక్కరికి కేసీఆర్ పదేపదే చెప్పారని కడియం తెలిపారు. టీఆర్ఎస్ గెలుపు చారిత్రక ఆవశ్యకమన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంపై టీఆర్ఎస్ కు ఉన్న బాధ బాధ్యత ఇతర పార్టీలకు ఉండదని ఆ విషయాన్ని వివరించాలని చెప్పినట్లు తెలిపారు. 

దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలంటే టీఆర్ఎస్ అధికారంలోకి రావాలన్న అంశాన్ని ప్రజల్లో బలంగా తీసుకెళ్లాలని సూచించినట్లు కడియం తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడవద్దని హితవు పలికారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చెయ్యాలని కేసీఆర్ సూచించినట్లు కడియం తెలిపారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios