Asianet News TeluguAsianet News Telugu

దసరా ఎఫెక్ట్ : ప్లాట్ ఫాం టికెట్ ధరలు డబుల్.. స్పెషల్ ట్రైన్స్ వివరాలు ఇవే..

దసరా పండుగ రైల్వే ప్రయాణికులకు మరింత భారం కానుంది. ప్లాట్ ఫాంల మీద రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే టికెట్ల ధరలను అమాంతం పెంచేసింది. 

Dussehra effect : SCR hikes platform ticket prices, Details of special trains in telangana
Author
First Published Sep 27, 2022, 8:02 AM IST

హైదరాబాద్ : దసరా పండుగ వేల రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే షాకిచ్చింది. పండుగ సందర్భంగా రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు ప్లాట్ఫామ్ టికెట్ ధరను పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. దీనిలో భాగంగానే కాచిగూడ రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫాం టికెట్ ధరను రూ. 10 నుంచి రూ.20 వరకు పెంచింది. కాగా, పెరిగిన ధరలు సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు అమలులో ఉంటాయని రైల్వే శాఖ స్పష్టం చేసింది. అక్టోబర్ 9 తర్వాత మళ్లీ టికెట్ ధర 10 రూపాయలకు చేరుతుంది. ఇదిలా ఉండగా దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను సైతం నడుపుతున్నట్లు వెల్లడించింది.

సికింద్రాబాద్-యశ్వంతపూర్, సికింద్రాబాద్- తిరుపతిల మధ్య ఈ ప్రత్యేక రైళ్ళు నడుస్తాయి.

 

ప్రత్యేక సర్వీసుల వివరాలు ఇవే…
- సెప్టెంబర్ 28న..  సికింద్రాబాద్ నుంచి యశ్వంతపూర్
- సెప్టెంబర్ 29న…  యశ్వంతపూర్ నుంచి సికింద్రాబాద్
- అక్టోబర్ 9న..  తిరుపతి నుంచి సికింద్రాబాద్
- అక్టోబర్ 10న..  సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు నడుస్తుంది 

Follow Us:
Download App:
  • android
  • ios