Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో అందుకే ఉద్యోగాలు రావడం లేదు: కేసీఆర్

రాష్ట్రంలో న‌కిలీ స‌ర్టిఫికెట్లు ఎక్కువ కావ‌డం వ‌ల్ల క్యాంపస్ రిక్రూట్ మెంట్ ఆగినట్లు చెప్పారు.

Duplicate certificates playing havoc with jobs  of Telangana youth

నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో మూడేళ్ల నుంచి ఉద్యోగ నియామకాలు సరిగా జరగడం లేదు.

అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ మూడేళ్లు గడుస్తున్నా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదు.

తన ఎన్నికల హామీలో లక్ష ఉద్యోగాలిస్తామని ప్రకటించిన గులాబీ పార్టీ ఇప్పటి వరకు అందులో సగం ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు.

గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించినా వివిధ అవాంతరాలు రావడంతో ఫలితాలు నిలిపివేసింది.

ఇక డీఎస్సీ నోటిఫికేషన్ ఓ పెద్ద జోక్ లా తయారైంది. ఇప్పటి వరకు పెద్ద స్థాయిలో ఉద్యోగ నియామకాలు చేపట్టింది కేవలోం పోలీసు శాఖలోనే...

దీంతో రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నరు. లక్ష ఉద్యోగాల మాటేమిటని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇటీవల తెలంగాణ రాజకీయ జేఏసీ కూడా లక్ష ఉద్యోగాల భర్తీ విషయంపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ పెద్ద ఆందోళన కూడా చేపట్టింది.

అయితే మూడేళ్ల కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలే కాదు ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగావకాశాలు పెద్దగా కనిపించడం లేదు. మరీ ముఖ్యంగా తెలంగాణలో పరిస్థితి దారుణంగా ఉంది. గతంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ ద్వారానే లక్షల మంది ఉద్యోగాలు తెచ్చుకున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఆ పరిస్థితి కనిపించడం లేదు.

అయితే రాష్ట్రంలో ప్రైవేటు సంస్థల్లోనూ ఉద్యోగనియామకాలు నిలిచిపోవడానికి కారణం ఏంటో స్వయంగా సీఎం కేసీఆర్ ఈ రోజు వివరించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీసులతో మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో ఆయన ఈరోజు సమావేశం ఈ సందర్భంగా మాట్లాడుతూ....

రాష్ట్రంలో క్యాంప‌స్ రిక్రూట్‌మెంట్‌ను నాస్‌కామ్ ఆపేసిందని అందువల్లే ప్రైవేటు రంగంలో అనుకున్న స్థాయిలో ఉద్యోగాలు రావడం లేదన్నారు.

రాష్ట్రంలో న‌కిలీ స‌ర్టిఫికెట్లు ఎక్కువ కావ‌డం వ‌ల్ల క్యాంపస్ రిక్రూట్ మెంట్ ఆగినట్లు చెప్పారు.

ఈ విషయంపై తెలంగాణ పోలీసులు దృష్టి పెట్టాలని సూచించారు. ఉన్న‌త స్థాయి పోలీసు అధికారుల‌తో చ‌ర్చ‌లు నిర్వ‌హించి నకిలీ సర్టిఫికేట్ల ను అరికట్టాలన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios