Asianet News TeluguAsianet News Telugu

దుబ్బాక నరసింహారెడ్డి: నల్గొండలో పాత మిత్రులు మళ్లీ కలుస్తారా

నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ మాజీ ఇంచార్జీ దుబ్బాక నరసింహారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేయడం ఆ పార్టీకి షాక్ కల్గిస్తోంది. 

dubbaka narasimha reddy likely to join in congress
Author
Hyderabad, First Published Dec 2, 2018, 4:24 PM IST

నల్గొండ: నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ మాజీ ఇంచార్జీ దుబ్బాక నరసింహారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేయడం ఆ పార్టీకి షాక్ కల్గిస్తోంది. దుబ్బాక నరసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే ఛాన్స్ ఉంది. 

టీడీపీ నల్గొండ అసెంబ్లీ ఇంచార్జీ కంచర్ల భూపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరితే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కాదని తనకు టికెట్టు దక్కదని భావించి టీఆర్ఎస్ లో చేరారు.  

2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ ఎన్నికల పొత్తులో భాగంగా నల్గొండ అసెంబ్లీ స్థానాన్ని చంద్రబాబునాయుడు బీజేపీకి కేటాయించారు. దీంతో టీడీపీ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగారు.  కంచర్ల భూపాల్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వల్ప ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.  ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన దుబ్బాక నరసింహారెడ్డి మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

రేవంత్ రెడ్డి టీడీపీని వీడిన సమయంలో కంచర్ల భూపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినా టికెట్టు దక్కదనే ఉద్దేశంతో టీఆర్ఎస్ లో చేరారు. కంచర్ల భూపాల్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరిన వెంటనే  టీఆర్ఎస్ నల్గొండ అసెంబ్లీ ఇంచార్జీ పదవిని కట్టబెట్టారు. 

టీఆర్ఎస్ ఇంచార్జీ పదవిని కంచర్ల భూపాల్ రెడ్డికి ఇవ్వడంతో దుబ్బాక నరసింహారెడ్డి అసంతృప్తితో ఉన్నారు. నామినేటేడ్ పదవిని ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటివరకు దుబ్బాక నరసింహారెడ్డికి పదవి ఇవ్వలేదు.

టీఆర్ఎస్ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న దుబ్బాక నరసింహారెడ్డికి కాంగ్రెస్ పార్టీ గాలం వేసింది.  దీంతో దుబ్బాక నరసింహారెడ్డి ఆదివారం నాడు  టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో దుబ్బాక నరసింహారెడ్డి చేరనున్నారు.

చిట్యాల మండలంలోని నేరడ గ్రామానికి చెందిన దుబ్బాక నరసింహారెడ్డి తొలుత కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. 1994లో నల్గొండ అసెంబ్లీ స్థానం నుండి సీపీఎం అభ్యర్థి నంద్యాల నర్సింహ్మారెడ్డి విజయం సాధించారు. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ స్థానం నుండి పోటీ చేసి సీపీఎం అభ్యర్థి నంద్యాల నర్సింహ్మారెడ్డిపై స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు.

తొలిసారి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించడంలో దుబ్బాక నరసింహారెడ్డి కీలక పాత్ర పోషించారు. 1999 ఎన్నికల తర్వాత దుబ్బాక నరసింహారెడ్డితో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో అభిప్రాయబేధాలు వచ్చాయి. వెంకట్ రెడ్డికి దుబ్బాక నరసింహారెడ్డి దూరమయ్యారు.

2009 ఎన్నికల్లో పీఆర్పీలో చేరారు. నల్గొండ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పీఆర్పీ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో చేరి  టీఆర్ఎస్ లో చేరారు.  నల్గొండ అసెంబ్లీ టీఆర్ఎస్ ఇంచార్జీగా కేసీఆర్ బాధ్యతలను అప్పగించారు.

గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన దుబ్బాక నరసింహారెడ్డి మూడో స్థానంలో నిలిచారు.  కోమటిరెడ్డిని ఓడించేందుకు గాను  బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలనే ఉద్దేశ్యంతో కంచర్ల భూపాల్ రెడ్డిని టీఆర్ఎస్ తమ అభ్యర్థిగా బరిలోకి దింపింది. నామినేటేడ్ పదవులు ఇస్తామని ఇచ్చిన దుబ్బాక నరసింహారెడ్డికి ఇచ్చిన హామీని టీఆర్ఎస్ అమలు చేయలేదు. దీంతో దుబ్బాక నరసింహారెడ్డి టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు.

త్వరలోనే దుబ్బాక నరసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే చాన్స్ లేకపోలేదు. దుబ్బాక నరసింహారెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్గుగా నల్గొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు.

దుబ్బాక కాంగ్రెస్ పార్టీలో చేరితే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజయం కోసం పనిచేయాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. అయితే  తనకు టికెట్టు దక్కని కంచర్ల భూపాల్ రెడ్డి ఓడిపోవాలంటే కోమటిరెడ్డి విజయం సాధించాలి. దీంతో శత్రువు శత్రువుకు మిత్రుడు. దీంతో మరోసారి పాత మిత్రులు కలిసే చాన్స్ లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


 

 

Follow Us:
Download App:
  • android
  • ios