Asianet News TeluguAsianet News Telugu

దుబ్బాక ఉప ఎన్నిక: టీఆర్ఎస్ కు షాక్, అంతిమ విజయం బిెజెపిదే

దుబ్బాక అసెంబ్లీ స్జానానికి జరిగిన ఉప ఎన్నికలో అనూహ్యంగా బిజెపి విజయం సాధించింది. నరాలు తెగే ఉత్కంఠ పోరులో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు.

Dubbaka Bypoll  Results Live Updates
Author
Siddipet, First Published Nov 10, 2020, 7:45 AM IST

దుబ్బాక ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థి రఘునందని్ రావు మెజారిటీ 1079కి తగ్గింది. మొరాయించిన 4 ఈవీఎంల ఓట్లు కూడా లెక్కించిన తర్వాత ఆ మెజారిటీ తగ్గింది. దుబ్బాకలో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించినట్లు ఈసీ అధికారికంగా ప్రకటించింది. 

దుబ్బాక ఉప ఎన్నికలో బిజెపి సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. నరాలు తెగే ఉత్కంఠ పోరులో చివరకు బిజెపి అభ్యర్థి రఘునందని్ రావును విజయం వరించింది. దుబ్బాక ఉప ఎన్నిక టీఆర్ఎస్ కు భార్ షాక్ నే ఇచ్చింది. 1118 ఓట్ల మెజారిటీతో రఘునందన్ రావు టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతపై విజయం సాధించారు. 

దుబ్బాక ఉప ఎన్నిక 22వ రౌండు ఓట్ల లెక్కింపులో బిజెపి ఆధిక్యం సాధించింది. బిజెపి అభ్యర్థి రఘునందన్ రావుకు ఈ రౌండ్ లో 438 ఓట్ల ఆధిక్యం లభించింది. దీంతో ఆయన మెజారిటీ 1058కి పెరిగింది. ఇక చివరి రౌండు ఓట్ల లెక్కింపు మాత్రమే మిగిలి ఉంది.

దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు 21వ రౌండ్ లోనూ బిజెపికి ఆధిక్యం లభించింది. ఈ రౌండులో బిజెపికి 380 ఓట్ల ఆధిక్యతను సాధించింది. దీంతో బిజెపి మొత్తంగా 620 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు 20వ రౌండ్ ముగిసే సరికి తిరిగి బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు స్వల్ప ఆధిక్యంలోకి వచ్చారు 20వ రౌండులో ఆయనకు 491 ఓట్ల ఆధిక్యం లభించింది. దీంతో మొత్తంగా ప్రస్తుతం రఘునందన్ రావు 240 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు 19వ రౌండు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ ఆధిక్యంలోకి వచ్చింది. ఈ రౌండులో టీఆర్ఎస్ కు 425 ఓట్ల ఆధిక్యం లభించింది. మొత్తంగా టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత 251 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.ఇంకా నాలుగు రౌండ్ల ఓట్ల లెక్కింపు ఉంది.

దుబ్బాక ఉప ఎన్నికలో బిజెపి, టీఆర్ఎస్ మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. 18వ రౌండు ఓట్ల లెక్కింపు ముగిసేసరికి బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు కేవలం 174 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.లెక్కించాల్సిన ఓట్లు కేవలం 32 వేలు మాత్రమే ఉన్నాయి. టీఆర్ఎస్ కు 18వ రౌండులో 688 ఓట్ల ఆదిక్యత లభించింది.

దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు 17వ రౌండులో టీఆర్ఎస్ ఆధిక్యం సాధించింది. దీంతో బిజెపి అభ్యర్థి రఘనందన్ రావు ఆధిక్యం 862 ఓట్లకు తగ్గింది. చివరి రౌండ్లలో టీఆర్ఎస్ పుంజుకుంటోంది. 18వ రౌండులో కూడా టీఆర్ఎస్ ఆదిక్యం సాధించింది. 

దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు 16వ రౌండులోనూ టీఆర్ఎస్ ఆదిక్యం సాధించింది. టీఆర్ఎస్ కు ఈ రౌండులో 749 ఓట్ల ఆధిక్యం సాధించింది. దీంతో బిజెపి అభ్యర్థి మెజారిటి 1,734 ఓట్లకు తగ్గింది.

దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు 15వ రౌండులో టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతకు 955 ఓట్ల ఆధిక్యం లభించింది. దీంతో బిజెపి అభ్యర్థి రఘనందన్ రావు ఆధిక్యం 2,483 ఓట్లకు తగ్గింది.

దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు 13వ రౌండులో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు ఆధిక్యం లభించింది. ఈ రౌండులో ఆమెకు 304 ఓట్ల ఆధిక్యం లభించింది. దీంతో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు మెజారిటీ 3,726 ఓట్లకు తగ్గింది. 14వ రౌండులోనూ టీఆర్ఎస్ కు ఆదిక్యం లభించింది. టీఆర్ఎస్ 288 ఓట్ల మెజారిటీని సాధించింది. దీంతో రఘునందన్ రావు మెజారిటీ 3,438 ఓట్లకు తగ్గింది.

దుబ్బాక ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు 12వ రౌండులోనూ బిజెపి ఆధిక్యం కనబరిచింది. ఈ రౌండులో బిజెపికి 83 ఓట్ల ఆధిక్యం లభించింది. దీంతో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు 4,030 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు 11వ రౌండులో బిజెపి అభ్యర్థి రఘనందన్ రావు ఆధిక్యం సాధించారు. ఈ రౌండులో 199 ఓట్ల ఆధిక్యం లభించింది. దీంతో రఘునందన్ రావు 3933 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

దుబ్బాక ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో పదో రౌండు ముగిసే సరికి బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యం 3,734కు తగ్గింది. పదో రౌండులో టీఆర్ఎస్ ఆధిక్యం సాధించింది.

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు దూసుకుపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తొమ్మిదో రౌండులోనూ ఆయనకు ఆధిక్యం లభించింది. దీంతో ఆయన ఆధిక్యం ఇప్పటి వరకు 4,190 ఓట్లకు చేరుకుంది. తొమ్మిదో రౌండులో ఆయనకు 1,084 ఓట్ల ఆధిక్యం లభింంచింది.

దుబ్బాక ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఎనిమిదో రౌండులో టీఆర్ఎస్ కు ఆధిక్యం లభించినట్లు తొలుత భావించినప్పటికీ పలితం తారుమారైంది. ఎనిమిదో రౌండులో బిజెపికే ఆధిక్యం లభించింది. దీంతో బీజెపి అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యం 3,106కు పెరిగింది. ఎనిమిదో రౌండులో ఆయనకు 621 ఓట్ల ఆధిక్యం లభించింది.

గ్రామీణ ప్రాంతాల్లో తమకు మెజారిటీ వస్తుందనే ఆశలు నిజమవుతాయా అనేది చూడాల్సి ఉంది. ఏడో రౌండులోనూ టీఆర్ఎస్ ఆభ్యర్థి సుజాత మెజారిటీ సాధించారు. దీంతో బిజెపి మొత్తం మెజారిటీ 2485కు తగ్గింది. ఏడో రౌండులో టీఆర్ఎస్ కు 182 ఓట్ల ఆధిక్యత లభించింది.

దుబ్బాక శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత ఆరో రౌండులో ఆధిక్యత సాధించారు. టీఆర్ఎస్ కు 353 ఓట్ల ఆధిక్యత లభించింది. ఆరో రౌండు ముగిసే సరికి బిజెపి అభ్యర్థి 2667 ఓట్ల ఆధిక్యతలో ఉంది. 

దుబ్బాక శాసనసభ నియోజకవర్గంలో ఐదో రౌండులోనూ బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యంలో కొనసాగారు. ఐదో రౌండు ముగిసే సరికి రఘునందన్ రావుకు 3,020 ఓట్ల ఆధిక్యత లభిచింది. 

దుబ్బాక ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో నాలుగో రౌండులోనూ బిెజెపి అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యత సాధించారు దీంతో రఘునందనరావు టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతపై 2,684 ఓట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు. నాలుగో రౌండులో రఘునందన్ రావుకు 1425 ఓట్ల ఆధిక్యత లభించింది.

దుబ్బాక ఉప ఎన్నిక మూడో రౌండ్ లోనూ టీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ తగిలింది. బిజెపికి ఆధిక్యత లభించింది. దాంతో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు దుబ్బాకలో 1259 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స్వగ్రామంలో కూడా బిజెపికి 110 ఓట్ల ఆధిక్యత లభిచింది. 

దుబ్బాక ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై 1,135 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

దుబ్బాక శాసనసభ ఉప ఎన్నికల్లో రెండో రౌండులోనూ బిజెపి అభ్యర్తి రఘునందన్ రావు ఆధిక్యత సాధించారు రెండో రౌండులో బిజెపికి 279 ఆధిక్యత లభించింది. మొత్తం 620 ఓట్ల ఆధిక్యతలో బిజెపి ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత రెండో స్థానంలో కొనసాగుతున్నారు. 

దుబ్బాకలో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యత సాధించారు. మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపులో 341 ఓట్ల ఆధిక్యత బిజెపికి లభించింది.

దుబ్బాక శాసనసభ ఉప ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత ముందంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ఆమెకు ఆధిక్యత లభించింది.

దుబ్బాక అసెంబ్లీ స్జానానికి జరిగిన ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ ప్రారంభమయింది.   సిద్దిపేటలోని ఇందూరు ఇంజనీరింగ్ కాలేజీలో ఓట్లను లెక్కించడం ఆరంభించారు. కాలేజీలోని డీ బ్లాక్ లో ఓట్ల లెక్కింపు ప్రక్రియను కొనసాగించనున్నారు. 

తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. ఆ తర్వాత ఈవీఎంలలో ఓట్లను లెక్కించనున్నారు. మొత్తం 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 23 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మొత్తం 200 మంది సిబ్బంది పాల్గొంటారు. 

దుబ్బాక శాసనసభ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు మంగళవారం ఉదయం సిద్ధిపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబ సమేతంగా ఆయన పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయన కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలు నేడు వెలువడనున్న విషయం తెలిసిందే. 

దుబ్బాక అసెంబ్లీ స్జానానికి జరిగిన ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికొద్దిసేపట్లో కౌంటింగ్ మొదలవనుంది.  

సిద్దిపేటలోని ఇందూరు ఇంజనీరింగ్ కాలేజీలో ఓట్లను లెక్కించనున్నారు. కాలేజీలోని డీ బ్లాక్ లో ఓట్ల లెక్కింపు ప్రక్రియను కొనసాగించనున్నారు. 

also read:దుబ్బాక బైపోల్ ఎగ్జిట్ పోల్స్ విడుదల: గెలుపెవరిదంటే..

తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంలలో ఓట్లను లెక్కించనున్నారు. మొత్తం 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 23 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మొత్తం 200 మంది సిబ్బంది పాల్గొంటారు. 

ఈ నెల 3వ తేదీన జరిగిన పోలింగ్ లో 1,64, 192 మంది ఓటు హక్కును వినియోగించుకొన్నారు.  ఈ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లోని 315 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలను ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ లో భద్రపర్చారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో 23 మంది బరిలో ఉన్నారు.

ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది. టీఆర్ఎస్ తరపున సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత, కాంగ్రెస్ అభ్యర్ధిగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ అభ్యర్ధిగా రఘునందన్ రావులు బరిలో నిలిచారు.2018 ఎన్నికల కంటే ఈ ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గింది. 

Follow Us:
Download App:
  • android
  • ios