దుబ్బాక ఉపఎన్నిక పోరు ముగిసింది. కాంగ్రెస్, బీజేపీ, అధికార తెరాస హోరాహోరీగా తలపడ్డ పోరులో విజేతను ఎన్నుకునేందుకు ఓటర్లు ఆసక్తిని కనబర్చారు. వారు తమ నిర్ణయాలను ఈవీఎం లలో నిక్షిప్తం చేసారు. ఇక వోటింగ్ పూర్తవడంతో ఎగ్జిట్ పోల్ ఫలితాలను కూడా సర్వే చేసిన ఆయా సంస్థలు ప్రకటించేసాయి. ఒకసారి ఆ ఫలితాలు ఎలా ఉన్నాయో సర్వే సంస్థల ఆధారంగా చూద్దాము. 

నాగన్న ఉరఫ్ థర్డ్ విజన్ రీసెర్చ్ అండ్ సర్వీసెస్ సంస్థ తమ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో టీఆర్ఎస్ కు విజయాన్ని కట్టబెట్టింది. 51-54 శాతం ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత తొలిస్థానం సాధించగా.. 33-36 శాతం ఓట్లతో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌కు రెండోస్థానం దక్కుతుందని, 8-11 శాతం ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి మూడోస్థానానికి పరిమితం అవుతాడని అంచనా వేసింది. 

ఇక పొలిటికల్ ల్యాబోరేటరీ అనే మరో సంస్థ మాత్రం ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో బీజేపీ విజయం సాధించబోతున్నట్లుగా పేర్కొనడం గమనార్హం. 47 శాతం ఓట్లతో బీజేపీకి మొదటి స్థానం రానున్నట్లు తెలిపిన ఈ సర్వే.... 38 శాతం ఓట్లతో టీఆర్ఎస్‌ రెండోస్థానంలో నిలుస్తుందని, కాంగ్రెస్‌ 13 శాతం ఓట్లతో మూడవ స్థానానికి పరిమితం అవనున్నట్టు పేర్కొంది. 

ఇక నేడు ముగిసిన వోటింగ్ తాలూకు కౌంటింగ్ ఈ నెల 10వ తేదీన జరగనుంది. అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి.