దుబ్బాక: సిద్దిపేటలో అంజన్ రావు ఇంట్లో దబ్బులతో తనకు ఏం సంబంధమని దుబ్బాక నుండి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న రఘునందన్ రావు ప్రశ్నించారు.

మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. సిద్దిపేటలోని అంజన్ రావు ఇంట్లో పోలీసులు రూ. 18 లక్షలు సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసిన తర్వాత రఘునందన్ రావు ఆ ఇంటి వద్ద ధర్నాకు దిగిన విషయం తెలిసిందే.

తన ఇంట్లో ఒక్క పైసా కూడ దొరకలేదన్నారు. బీజేపీకి డిపాజిట్ రాదని చెబుతున్న హరీష్ రావు ఎందుకు భుజాలు తడుముకొంటున్నారని ఆయన ప్రశ్నించారు. తనపై వ్యక్తిగతమైన కక్షతోనే హరీష్ రావు వ్యవహరిస్తున్నారని ఆయన చెప్పారు.

పక్క ఇంట్లో డబ్బులు దొరికితే నన్నెందుకు నిందిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.పోలీసులే బలవంతంగా ఈ వీడియోను రికార్డు చేయించొచ్చు కదా అనే అనుమానం వ్యక్తం చేశారు. సీపీ టీఆర్ఎస్ కార్యకర్తగా పనిచేస్తే తాను ఏం చేయలేనని చెప్పారు.

also read:సిద్దిపేటలో అంజన్ రావు ఇంట్లో డబ్బులు సీజ్: కీలక వీడియోను విడుదల చేసిన పోలీసులు

పోలీసులు సీజ్ చేసిన డబ్బులో రూ. 5 లక్షలను బీజేపీ కార్యకర్తలు తీసుకెళ్లారని సీపీ చెప్పారు. అంజన్ రావు ఇంట్లో  దొరికిన డబ్బుల వ్యవహారం రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్దానికి దారి తీసింది.