గౌరవించడం లేదని అసంతృప్తి: సొంత గూటికి డిఎస్?

DS may come back to Congress
Highlights

తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ సొంత గూటికి చేరుకుంటారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ సొంత గూటికి చేరుకుంటారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆయన తిరిగి కాంగ్రెసు పార్టీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. డిఎస్ పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. 

గత వారం ఆయన తన తన అనుచరులతో నిజామాబాదులో సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో ఆయన పార్టీ మారుతారనే ప్రచారం ఊపందుకుంది. 

తమ నేతకు టీఆర్ఎస్ సరైన గౌరవం ఇవ్వడం లేదని నిజామాబాద్ రూరల్, అర్భన్ నియోజకవర్గాల్లోని డిఎస్ అనుచరులు అసంతృప్తితో ఉన్నారు. సీనియర్లకు టిఆర్ఎస్ లో గౌరవం లేదని వారంటున్నారు. డిఎస్ ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వెంట ఉంటామని సమావేశంలో తీర్మానం చేశారు. 

అయితే, తాను పార్టీ మారుతాననే ప్రచారం నిజం లేదని డిఎస్ అన్నారు .తాను పార్టీలో కొనసాగుతానని, పార్టీ కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తి పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకుని వెళ్తానని డిఎస్ అన్నారు 

డిఎస్ కు తమ పార్టీ అపారమైన గౌరవం లభిస్తోందని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు, కేసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత అంటున్నారు. ఎమ్మెల్సీ సీటు ఇవ్వకుండా కాంగ్రెసు పార్టీ డిఎస్ ను అవమానించిందని, తాము రాజ్యసభ సీటు ఇచ్చామని ఆమె చెబుతున్నారు.

loader