Asianet News TeluguAsianet News Telugu

హైద్రాబాద్‌లో మద్యం మత్తులో యువతుల వీరంగం: యువకుడి నుండి డబ్బులు లాక్కెళ్లారు

మద్యం మత్తులో హైద్రాబాద్  చైతన్యపురిలో యువతులు వీరంగం సృష్టించారు.  మద్యం మత్తులో యువతులు చేసిన హంగామాతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయమై ఫిర్యాదు చేసినా కూడ పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

drunk women attack on man in chaitanyapuri for money
Author
Hyderabad, First Published Aug 23, 2020, 1:08 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హైదరాబాద్:మద్యం మత్తులో హైద్రాబాద్  చైతన్యపురిలో యువతులు వీరంగం సృష్టించారు.  మద్యం మత్తులో యువతులు చేసిన హంగామాతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయమై ఫిర్యాదు చేసినా కూడ పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

చైతన్యపురిలోని కనకదురగ్గ వైన్స్ దుకాణం సమీపంలో మద్యం తాగి యువతులు హల్ చల్ చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చేవారిపై దాడులకు దిగారని స్థానికులు చెబుతున్నారు.

మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చిన ఓ యువకుడిపై యువతులు చొక్కా విప్పి దాడులకు దిగారని స్థానికులు ఆరోపించారు. అంతేకాదు యువకుడి వద్ద ఉన్న డబ్బులు కూడ లాక్కుకొన్నారని స్థానికులు చెబుతున్నారు. 

ఈ ప్రాంతంలో యువతు ఆగడాలు పెచ్చుమీరిపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. యువతుల నుండి తమను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ప్రాంతంలో పోలీసు నిఘాను ఏర్పాటు చేసి యువతుల ఆగడాలను అరికట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios