న్యూఇయర్ సందర్భంగా  హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు విపరీతంగా నమోదయ్యాయి.  వారం రోజుల్లోనే మద్యం తాగి వాహనాలు నడిపిన 3,571 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

డిసెంబర్ 27నుంచి జనవరి 4 సోమవారం తెల్లవారుజుము వరకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలుచోట్ల తనిఖీలు నిర్వహించారు. డిసెంబర్ 31వ తేదీ ఒక్క రోజే 931 కేసులు నమోదయ్యాయి. 

అత్యధికంగా మాదాపూర్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో 714 కేసులు, గచ్చిబౌలీలో 709 కేసులు.. అత్యల్పంగా బాలాపూర్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో 173 కేసులను పోలీసులు నమోదు చేసినట్లు తెలిపారు.

మద్యం సేవించి వాహనాలు నడుపుతుండటం వల్లే ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయని పోలీసులు పేర్కొన్నారు. వాటిని నివారించేందుకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో తనిఖీలు పక్కగా చేపడుతున్నట్లు వివరించారు. తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను ఠాణాలకు తరలిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.