New Year: డ్రంక్ అండ్ డ్రైవ్‌కు రూ. 15 వేల ఫైన్, క్యాబ్స్ రైడ్ నిరాకరించినా జరిమానా

నూతన సంవత్సర సంబురాలు శృతి మించకుండా హైదరాబాద్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. డ్రంక్ డ్రైవ్‌లో పట్టుబడితే రూ. 15 వేల జరిమానా, రెండేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. ఆటో డ్రైవర్లకూ హెచ్చరికలు చేశారు.
 

drunk and drive fine rs 15,000 on new years eve hyderabad police warning kms

Hyderabad: మరో మూడు రోజుల్లో న్యూ ఇయర్ సంబురాలు మొదలు కానున్నాయి. డిసెంబర్ 31వ తేదీ రాత్రి కొత్త సంవత్సర వేడుకల్లో మునిగిపోతారు. ముఖ్యంగా యువత దావత్‌కు ఇప్పటికే ప్లాన్లు చేసుకుని ఉంటారు. రాత్రిపూట రోడ్లపై హల్ చల్ చేసే అవకాశాలూ లేకపోలేదు. ఈ దావత్‌లలో భాగంగా లిక్కర్ తాగి రోడ్డెక్కుతుంటారు. అది ఎన్నో రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతాయి. వీటిని నివారించడానికి హైదరాబాద్ పోలీసులు నడుం బిగించారు. జరిమానాలతో హెచ్చరికలు చేస్తున్నారు. తాజాగా, న్యూ ఇయర్ వేడుకల సందర్భంలో హైదరాబాద్ పోలీసులు కీలక ప్రకటన చేశారు.

డ్రంక్ డ్రైవ్ చేస్తే రూ. 15 వేలు ఫైన్ వేస్తామని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. వారి వివరాల ప్రకారం తొలిసారి ఈ అఫెన్స్ చేసినవారికి రూ. 10,000 జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష కూడా పడొచ్చు. రెండో సారి ఈ నేరం చేసిన వారికి రూ. 15,000 ఫైన్, రెండేళ్ల వరకు జైలు శిక్ష పడొచ్చు. రాత్రి 8 గంటలు దాటిన తర్వాత డ్రంక్ డ్రైవర్ల పట్టివేతకు చెకింగ్‌లు పెంచుతామని సిటీ పోలీసులు వెల్లడించారు.

Also Read: Congress: ప్రతిపక్ష కూటమికి అయోధ్య సవాల్.. రామ మందిర కార్యక్రమానికి వెళ్లాలా? వద్దా?

ఇదే ఆసరాగా క్యాబ్ డ్రైవర్లు ప్రయాణికుల నుంచి ఎక్కువగా చార్జీలు వసూలు చేసినా బాదుడు తప్పదు. ఇలా ఎక్కువ చార్జీలు వసూలు చేసే క్యాబ్ డ్రైవర్లకూ ఫైన్ వేయనున్నారు. ఆటో రిక్షాలు తప్పకుండా యూనిఫామ్ ధరించాలి. అన్ని డాక్యుమెంట్లు వెంట ఉంచుకోవాలి. ఒక వేళ వీళ్లు ప్రయాణికులను తీసుకెళ్లడానికి నిరాకరిస్తే రూ. 500 జరిమానా పడుతుంది. ఏ డ్రైవర్ అయినా కస్టమర్‌ను తీసుకెళ్లకుంటే వారు 9490617346 నెంబర్‌కు రిపోర్ట్ చేయవచ్చు. అలాగే.. పలు ఫ్లైఓవర్లను కూడా మూసేయనున్నట్టు తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios