ఈ ప్రమాదానికి కారకుడైన సందీప్ రెడ్డి మద్యం సేవించి కార్ నడిపినట్లు పోలీసులు దృవీకిరించారు. సందీప్ రెడ్డికి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహించగా 228 శాతం వచ్చినట్లు పోలీసులు తెలిపారు.  నిందితుడు సందీప్ రెడ్డి ని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. 

హైదరాబాద్ : శనివారం మొయినబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటనలో ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఈ ప్రమాదంలో ఇప్పటికే ప్రేమిక 16 ఘటన స్థలంలోనే మృతి చెందింది. ఈ ప్రమాదంలో అక్షర, సౌమ్యలు తీవ్ర గాయలపాలై గచ్చిబౌలి కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. వీరిలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ సౌమ్య (18) ఈ రోజు తెల్లవారు జామున మృతి చెందింది. అక్షర(14) పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

అయితే, ఈ ప్రమాదానికి కారకుడైన సందీప్ రెడ్డి మద్యం సేవించి కార్ నడిపినట్లు పోలీసులు దృవీకిరించారు. సందీప్ రెడ్డికి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహించగా 228 శాతం వచ్చినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు సందీప్ రెడ్డి ని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. 

ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్రంలోని మొయినాబాదులో జరిగిన ప్రమాదంలో మరో అమ్మాయి మరణించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. దీంతో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య రెండుకు చేరుకుంది. మరో అమ్మాయి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు చెబుతన్నారు. 

Drunk and Drive: స్కూటీని ఢీకొట్టిన కారు, ఇద్దరు అమ్మాయిలు మృతి

మొయినాబాదులో ఆదివారంనాడు ఓ కారు స్కూటీని ఢీకొట్టింది. దాంతో ప్రేమిక అనే అమ్మాయి అక్కడికక్కడే మరణించింది. మరో అమ్మాయి సౌమ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. మూడో అమ్మాయి ఆక్షర ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. డ్రైవర్ కారును వదిలేసి పారిపోయాడు. కారు డ్రైవర్ మద్యం సేవించి ఉన్నట్లు సమాచారం. మద్యం మత్తులో కారు నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అంటున్నారు.

పొగమంచు ప్రమాదం
హైదరాబాదులోని ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై ప్రమాదం చోటు చేసుకుంది. ముందుకు వెళ్తున్న కారును లారీ ఢీకొట్టింది. పొగమంచు కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఓఆర్ఆర్ నుంచి కోదాడకు వెళ్లే దారిలో ఈ రోడ్డు ప్రమాదం సభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.