హైదరాబాద్‌లోని చారిత్రక ఛార్మినార్ వద్ద గుర్తు తెలియని డ్రోన్ ఒకటి చక్కర్లు కొట్టడం పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. ఛార్మినార్ పరిసర ప్రాంతాల్లో డ్రోన్ ఎగురుతుండటాన్ని గమనించిన పోలీసులు వెంటనే అప్రమత్తమై దానిని ఆపరేట్ చేస్తున్న సుపెర్ననాథ అనే పశ్చిమబెంగాల్ యువతిని అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్‌ను ఎందుకు ఎగురవేసింది.. ఎక్కడెక్కడ దీనితో వివరాలు సేకరించింది అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

 పారా గ్లిండర్లు, రిమోట్ కంట్రోల్ డ్రోన్స్, మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఉపయోగించి ఉగ్రవాదులు దాడులకకు పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించడంతో.. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్  పరిధిలో డ్రోన్లపై పోలీసులు నిషేధం విధించారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా డ్రోన్లు వినియోగిస్తే కఠినచర్యలు తీసుకుంటామని ముందే హెచ్చరించారు.. ఒకవేళత తప్పనిసరి పరిస్ధితుల్లో ఉపయోగించాల్సి వస్తే ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు.