మిర్యాలగూడ వ్యాపారి మారుతీరావు ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇటీవల హైదరాబాద్ నగరంలోని ఆర్యవైశ్య భవన్ లో మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.  ఈ కేసు దర్యాప్తులో భాగంగా సైఫాబాద్ పోలీసులు తాజాగా మారుతీరావు డ్రైవర్ రాజేష్ ని ప్రశ్నించారు.

Also Read మారుతీరావు చివరిగా ఎవరితో మాట్లాడారు..? రెండు వారాల్లో ....

మిర్యాలగూడ నుంచి హైదరాబాద్ కి బయలు దేరిన తర్వా మార్గమధ్యంలో ఓ పురుగుల దుకాణం ముందు కారు ఆపమని మారుతీరావు కోరినట్లు డ్రైవర్ చెప్పాడు. అయితే.. చాలా సేపు దుకాణం ముందే నిల్చున్న ఆయన లోపలికి మాత్రం వెళ్లలేదని డ్రైవర్ తెలిపాడు. అయితే... గతంలో మారుతీరావు చాలాసార్లు ఆ పురుగుల మందు దుకాణంలో సమయం గడిపినట్లు  పోలీసులకు వివరించాడు.

శనివారం రాత్రి ఆర్యవైశ్య భవన్ కు చేరుకున్నాక తామిద్దరమూ బయటకు వెళ్లి అల్పాహారం తీసుకున్నట్లు వివరించాడు. గదికి వెళ్లాక తనకు ఇష్టమైన గారెలు తెప్పించుకొని మారుతీరావు తిన్నాడని డ్రైవర్ పోలీసులకు వివరించాడు.

తాను కూడా గదిలో పడుకుంటానంటే మారుతీరావు వద్దు అన్నాడని... తనను మాత్రం కారులో పడుకోమని చెప్పాడని వివరించాడు. కాగా... మరోసారి డ్రైవర్ ని విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే మారుతీరావు ఫోన్ డేటాను సేకరించిన పోలీసులు... డ్రైవర్ కాల్ డేటా కూడా ఆరాతీసే అవకాశం ఉందని తెలుస్తోంది.