బంగారం స్మగ్లింగ్ లో నయా ప్లాన్.. పేస్టులో బంగారం పొడి చేసి..

DRI nabs passenger carrying 1.85 kg of gold paste at Hyderabad airport
Highlights

మొన్నామధ్య ముంబయిలో ఇద్దరు మహిళలు ఏకంగా వారి ప్రైవేటు పార్ట్స్ లో దాచిపెట్టి మరి స్మగ్లింగ్ చేయాలనుకున్నారు. తాజాగా.. స్మగ్లర్లు పంథా మార్చుకున్నారు.

అక్రమంగా బంగారాన్ని తరలించేందుకు స్మగ్లర్లు కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు. ఇప్పటి వరకు బట్టల బ్యాగుల్లో, చెప్పుల్లో, శరీరంపైనా బంగారం దాచుకొని స్మగ్లింగ్ చేసేవారు. మొన్నామధ్య ముంబయిలో ఇద్దరు మహిళలు ఏకంగా వారి ప్రైవేటు పార్ట్స్ లో దాచిపెట్టి మరి స్మగ్లింగ్ చేయాలనుకున్నారు. తాజాగా.. స్మగ్లర్లు పంథా మార్చుకున్నారు.

పేస్టు రూపంలో ఉన్న కెమికల్‌ మిశ్రమంలో బంగారాన్ని పొడిగా చేసి తరలించేందుకు విఫలయత్నం చేశారు. దాన్ని రవాణా చేసేందుకు యత్నించి డీఆర్‌ఐ అధికారులకు చిక్కారు. ఎయిర్‌పోర్టులో ఆదివారం ఈ సంఘటన జరిగింది.
 
డీఆర్‌ఐ వర్గాల కథనం ప్రకారం.. కొలంబో కేంద్రం గా కొందరు స్మగ్లర్లు హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు బంగారం తరలిస్తున్నారని సమాచారం అందింది. శ్రీలంక రాజధాని కొలంబో నుంచి మదురై మీదుగా శంషాబాద్‌కు వచ్చిన విమానంలోంచి దిగి ఎయిర్‌పోర్టు వెలుపలికి వస్తున్న ప్రయాణికులపై నిఘా పెట్టారు. ఓ ప్రయాణికుడిపై అనుమానం వచ్చి అతడిని అదుపులోకి తీసుకొని సోదా చేశారు. అతని వద్ద పేస్టు రూపంలో ఉన్న బంగారాన్ని కనుగొన్నారు. మొత్తం పేస్టును కరిగించారు. పేస్టు బరువు 1,800 గ్రాములు. కరిగించాక 1,120 గ్రాములయింది. నిందితుడిని అరెస్టు చేశారు. దొరికిన బంగారాన్ని సీజ్‌ చేశామని డీఆర్‌ఐ అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

loader