Asianet News TeluguAsianet News Telugu

ముగిసిన శీతాకాల విడిది: న్యూఢిల్లీకి బయలుదేరిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము  శీతాకాల విడిది ముగిసింది. ఇవాళ మద్యాహ్నం  రాష్ట్రపతి  హకీంపేట విమానాశ్రయం నుండి  న్యూఢిల్లీకి బయలుదేరారు.   
 

Draupadi Murmu  leaves  For  New Delhi
Author
First Published Dec 30, 2022, 4:27 PM IST

హైదరాబాద్: రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము  శీతాకాల విడిది ముగిసింది.  శుక్రవారం నాడు మధ్యాహ్నం రాష్ట్రపతి   న్యూఢిల్లీకి తిరిగి వెళ్లారు. ఐదు రోజుల పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో  రాష్ట్రపతి  పర్యటించారు.   శీతాకాల విడిదిని ముగించుకొని న్యూఢిల్లీకి తిరిగి వెళ్తున్న  రాష్ట్రపతి ముర్ముకు  రాష్ట్ర గవర్నర్  తమిళిపై సౌందర రాజన్,  తెలంగాణ శాసనమండలి చైర్మెన్  గుత్తా సుఖేంద్ రెడ్డి , తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, పలువురు మంత్రులు, అధికారులు  వీడ్కోలు పలికారు..హకీంపేట విమనాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  హైద్రాబాద్ నుండి న్యూఢిల్లీకి తిరిగి వెళ్లారు. ఈ నెల  26వ తేదీన  ద్రౌపది ముర్ము  హైద్రాబాద్ కు వచ్చారు. ప్రతి ఏటా శీతాకాల విడిది కోసం  డిసెంబర్  మాసంలో రాష్ట్రపతి వస్తుంటారు.  కరోనా కారణంగా  రెండేళ్లుగా  రాష్ట్రపతి శీతాకాల విడిదికి దూరంగా  ఉన్నారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో   ఈ ఏడాది శీతాకాల విడిది కోసం  రాష్ట్రపతి  వచ్చారు.

also read:యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రాష్ట్రపతి ముర్ము పూజలు

శీతాకాల విడిది కోసం  రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము  ఈ నెల  26న తెలంగాణకు చేరుకున్నారు.  ఈ నెల  26న ఏపీలోని శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయాన్ని ఆమె దర్శించుకున్నారు.  అదే రోజున సాయంత్రం  రాజ్ భవన్ లో  గవర్నర్ తమిళిసై సౌందరరాజన్  ఇచ్చిన విందులో పాల్గొన్నారు.మ  ఈ నెల  27న కేశవ్ మెమెరియల్  విద్యా సంస్థల విద్యార్ధులతో నిర్వహించిన  ముఖాముఖిలో పాల్గొన్నారు. భద్రాచలంలో సీతారామస్వామిని  రాష్ట్రపతి  ముర్ము దర్శించుకున్నారు.  నిన్న  హైద్రాబాద్  షేక్ పేటలోని నారాయణమ్మ కాలేజీ విద్యార్ధులతో ముఖాముఖిలో పాల్గొన్నారు.   నిన్న సాయంత్రం హైద్రాబాద్ కు సమీపంలోని  ముచ్చింతల్ లో  సమాతామూర్తి విగ్రహన్ని  దర్శించుకున్నారు.ఇవాళ ఉదయమే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని ద్రౌపది ముర్ము సందర్శించుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios