డాక్టర్ ప్రియాంక రెడ్డిపై అత్యాచారం చేసి, హతమార్చిన నలుగురు నిందితులను పోలీసులు మేజిస్ట్రేట్ పాండు నాయక్ ముందు హాజరుపరిచారు. నిందితులను షాద్‌నగర్‌ పోలీస్ స్టేషన్‌కు తీసుకొస్తున్నట్లు తెలుసుకున్న స్థానికులు, ప్రజా సంఘాల కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మేజిస్ట్రేట్ రాకకుముందు నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ శనివారం ఉదయం నుంచి జనం ధర్నా చేస్తుండటంతో మేజిస్ట్రేట్ స్వయంగా షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. వీరికి మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్‌ను విధించారు. నలుగురు కామాంధులను శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మహబూబ్‌నగర్ జిల్లా జైలుకు తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి.