మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద ఉన్న రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అంబేద్కర్ విగ్రహానికి ఉన్న తలను తొలగించి కిందపడేశారు.

ఈ విషయం తెలుసుకున్న గ్రామంలోని దళిత సంఘాల నేతలు ఘటనాస్థలికి చేరుకుని ఆందోళనకు దిగారు. ఘటనకు బాధ్యులను అదుపులోకి తీసుకునేవరకు ఆందోళన విరమించబోమని పట్టుబట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు రాంపల్లికి చేరుకుని ఆందోళనకారులను శాంతింపజేశారు.