IPS Transfers : మరోసారి ఐఏఎస్ అధికారుల బదిలీలు.. కారణమదేనా..?
IPS Transfers : తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ బదిలీలకు సంబంధించి మార్పులు చేర్పులను ఉత్తర్వులు ద్వారా రిలీజ్ చేసింది మరింత సమాచారం అందిస్తారు. ఈ క్రమంలో ఎవరెవరు ఎక్కడి బదిలయ్యారో ఓ లూక్కేయండి.
IPS Transfers : తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి అధికారుల బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకూ జరిగిన బదిలీలల్లో కొందరికీ ప్రమోషన్.. మరికొందరికీ డిమోషన్ పొందారు. తాజాగా మరోసారి పలువురు ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో వీరి బదిలీలు జరిగినట్లు తెలుస్తోంది.
దాదాపు రెండు నెలల క్రితం బాధ్యతలు స్వీకరించిన రాచకొండ పోలీస్ కమిషనర్ జి. సుధీర్‌బాబు మల్టీ జోన్-2 ఐజీపీగా బదిలీ అయ్యారు. 2004 బ్యాచ్‌కు చెందిన అధికారి తరుణ్ జోషి రాచకొండకు నాల్గవ పోలీస్ కమిషనర్‌గా నియమితులయ్యారు. అలాగే.. జోయెల్ డేవిస్ సైబరాబాద్ ట్రాఫిక్ సీపీగా బదిలీ కాగా.. రాష్ట్ర క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (SCRB) డీఐజీగా నారాయణ నాయక్ నియమితులయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వం సోమవారం 12 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. పూర్తి జాబితా ఇదే..
- రాచకొండ సీపీగా - తరుణ్ జోషీ
- సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా - జోయల్ డెవిస్
- టీఎస్ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా - అపూర్వ రావు
- పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్గా - మురళీధర్
- రామగుండం సీపీగా - శ్రీనివాసులు
- సీఐడీ డీఐజీగా - నారాయణ నాయక్
- జోగులాంబ గద్వాల్ డీఐజీగా - ఎల్ఎస్ చౌహాన్
- ఈస్ట్ జోన్ డీసీపీగా - ఆర్. గిరిధర్
- హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా - సాధన రష్మీ
- హైదరాబాద్ మల్టీజోన్ ఐజీగా - సుధీర్ బాబు
- సౌత్ వెస్ట్ డీసీపీగా - ఉదయ్ కుమార్ రెడ్డి
- ట్రాన్స్ కో డీసీపీ - గిరిధర్